12ఏళ్ల వయసులో అత్యాచారం... 27ఏళ్ళ తర్వాత కొడుకుతో కలిసి ఫిర్యాదు

Arun Kumar P   | Asianet News
Published : Mar 07, 2021, 07:42 AM ISTUpdated : Mar 07, 2021, 08:02 AM IST
12ఏళ్ల వయసులో అత్యాచారం...  27ఏళ్ళ తర్వాత కొడుకుతో కలిసి ఫిర్యాదు

సారాంశం

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27ఏళ్ళ తర్వాత ఓ మహిళ తనపై చిన్నపుడు జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది.  

లక్నో: అభం శుభం తెలియని వయసులో తనపై జరిగిన అఘాయిత్యంపై ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27ఏళ్ళ తర్వాత బాధిత మహిళ తనపై చిన్నపుడు జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలోని సదర్ ప్రాంతంలో 1994 సమయంలో ఓ బాలిక బంధువుల వద్ద వుంటూ చదువుకునేది. అయితే ఈ బాలికపై కన్నేసిన ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో పలుమార్లు బలత్కారానికి పాల్పడ్డారు. దీంతో 12ఏళ్ల వయసులోనే ఆ బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.  

read more   బాలుడిపై మైనర్ బాలుర అత్యాచారం.. ఆ తర్వాత

అయితే బాలిక కుటుంబసభ్యులు  గుట్టుచప్పుడు కాకుండా ఆ పసికందును పెంచుకుంటామంటే వేరేవారికి ఇచ్చేశారు. ఆ తర్వాత బాధిత యువతికి పెళ్లి చేశారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఈ విషయం తెలిసి కట్టుకున్నవాడు వదిలేశాడు. ఇలా చిన్న వయసులోనే కష్టాలను ఎదురవయినా సదరు యువతి ధైర్యంగా జీవితాన్ని కొనసాగించింది. 

ఈ ఘటన జరిగి 27ఏళ్లు కావస్తోంది. పెద్దవాడయిన సదరు మహిళ కొడుకు పెంచిన తల్లిదండ్రుల ద్వారా అసలు నిజం తెలుసుకుని తల్లి వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే చిన్నపుడు తనపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు మహిళ కొడుకుకు తెలిపింది. దీంతో  తన తండ్రి ఎవరో తెలియజెప్పేందుకు వివరాలు వెలికితీయాలంటూ సదరు యువకుడు న్యాయస్థానాన్ని, పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తామని పోలీసులు చెప్పారు.   
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !