
BJP chief JP Nadda: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం అన్నారు. ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకున్న 23,000 మంది భారతీయులను విజయవంతం స్వదేశానికి చేర్చారని, కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
దక్షిణ ఢిల్లీ జిల్లాలో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులను మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలను కూడా రక్షించిందని అన్నారు. ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించి వారికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుండగా, బిజెపి కార్యకర్తలు వారి కుటుంబాలతో సన్నిహితంగా ఉన్నారని, వారి మద్దతును తెలియజేయడానికి అనేకసార్లు వారిని సందర్శించారని ఆయన అన్నారు.
అంతే కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పలు మార్లు వారితో మాట్లాడరని తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నారని, చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చారని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. ఇది మారుతున్న భారత్ అని అన్నారు.
అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా నడ్డా విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్, పిఎం ఆవాస్ యోజనను అడ్డుకున్నారని, లక్షలాది మంది పేదలను పథకం ప్రయోజనాల నుండి దూరం చేశారని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పుడు, కేజ్రీవాల్ తమ ప్రభుత్వం వ్యాక్సిన్‌లను సేకరిస్తామని చెప్పారని, అయితే వారంలోపు వెనక్కి తగ్గారని, దానిని చేసి ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని ప్రధాని మోదీని కోరారని నడ్డా చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ యోజన కింద 50 కోట్ల మందికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించబడిందని.. అయితే వీరిలో 72 లక్షల మంది ఢిల్లీ ప్రజలు ఈ పథకాన్ని కేజ్రీవాల్ తిరస్కరించడంతో ప్రయోజనం పొందలేకపోయారని జెపి నడ్డా విమర్శించారు. అలాగే..ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 2.56 ఇళ్లను నిర్మించామని బీజేపీ చీఫ్ చెప్పారు.
ఢిల్లీలోని మొత్తం 80 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉంది. కానీ ఆప్.. రవాణా, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ చేస్తున్న తప్పుడు వాగ్దానాలకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని అన్నారు. 2019-20లో.. ప్రభుత్వం దారిద్య్రరేఖ శాతాన్ని ఒక శాతానికి మించి పెరగనివ్వలేదనీ, మార్చి 2020 నుండి సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించమని తెలిపారు.