Punjab Election 2022: బ్రిటీషర్లలా పంజాబ్ ను దోచుకోవడానికి వచ్చాడు: కేజ్రీవాల్ పై చ‌న్నీ ఆగ్ర‌హం

Published : Feb 13, 2022, 11:05 AM ISTUpdated : Feb 13, 2022, 11:12 AM IST
Punjab Election 2022: బ్రిటీషర్లలా పంజాబ్ ను దోచుకోవడానికి వచ్చాడు:  కేజ్రీవాల్ పై చ‌న్నీ ఆగ్ర‌హం

సారాంశం

Punjab Election 2022: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించారని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. శనివారం అక్రమ మైనింగ్ కేసులో రోపార్ అడ్మినిస్ట్రేషన్‌చే క్లీన్ చిట్ పొందిన తరువాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేజ్రీవాల్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

Punjab Election 2022: పంజాబ్‌ను దోచుకోవడానికి కేజ్రీవాల్ వచ్చాడనీ, ఆప్ అధినేతను బ్రిటీషర్లతో పోల్చాడు పంజాబ్  సీఎం చన్నీ. క్రేజీవాల్ అబద్దాలకోరని. ఢిల్లీ సీఎం తనపై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో క్లీన్ చిట్ పొందిన త‌రువాత  చన్నీ కేజ్రీవాల్ పై విరుచుక‌ప‌డ్డారు. 
 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించారని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. శనివారం అక్రమ మైనింగ్ కేసులో రోపార్ అడ్మినిస్ట్రేషన్‌చే క్లీన్ చిట్ పొందిన తరువాత చరణ్‌జిత్ సింగ్ చన్నీ కేజ్రీవాల్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

చరణ్‌జిత్ సింగ్ చన్నీ శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ.. “అరవింద్ కేజ్రీవాల్ అబద్దాలకోరు.  అతడు నాపై అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఏదీ నిజం కాదు. ఆయ‌న  గవర్నర్‌కు  నాపై ఫిర్యాదు చేశారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ విచారణకు ఆదేశించాడు. ఆ విచార‌ణ‌లో నాపై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ ఆవాస్త‌మ‌ని తేలింది. ఎప్పుడూ సత్యమే గెలుస్తుంది” అని చన్నీ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఇతర వ్యక్తులు పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చారని ఆయన ఆరోపించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన విధంగా.. కేజ్రీవాల్, అతని  కుటుంబం రాఘవ్ చద్దా, ఇతర వ్యక్తులు పంజాబ్‌ను దోచుకోవడానికి వచ్చార‌నీ. అయితే.. మొఘలులను  బ్రిటీష్ వాళ్ల‌ను దోచుకున్న‌ట్టుగా..  పంజాబ్ వారిని కూడా దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చన్నీ విమ‌ర్శించారు. 

గ‌తంలో.. అక్రమ మైనింగ్ కేసులో చన్నీపై బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ త‌రుణంలో  కాంగ్రెస్ ఎంపీ రణ్‌వీత్ సింగ్ బిట్టు కూడా గవర్నర్ జోక్యాన్ని కోరారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతోందని ఆప్ కూడా  చ‌న్నీ ప్రభుత్వాన్ని నిందించింది.
 
 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ రోజుకి ముందు పంజాబ్ ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలతో సంబంధం ఉన్న ఆరోపణల నుండి క్లియర్ అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ ఆరోప‌ణ‌ల‌పై పంజాబ్ గవర్నర్ విచార‌ణ‌కు ఆదేశించారు. గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు పంజాబ్ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఇసుక మైనింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు పంపిన స్టేటస్ రిపోర్ట్‌లో ఇసుక తవ్వకాలపై ఎలాంటి ఫిర్యాదు, రికార్డులు కనిపించలేదని చన్ని నియోజకవర్గ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఫిబ్రవరి 3న జలంధర్‌లో అక్రమ ఇసుక తవ్వకాల కేసులో హనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.  ఈ త‌రుణంలో హనీ పై దాడులు నిర్వహించి.. అతని నుంచి  ₹ 7.9 కోట్ల  ఆస్తిని, మరో నిందితుడు సందీప్ కుమార్ నుండి ₹ 2 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్‌.. మ‌రో 2 నెల‌ల్లో భారీగా పెర‌నున్న జీతాలు.?