Indian GM Harika Dronavalli: ఇండియ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక‌ ద్రోణ‌వ‌ల్లికి లైంగిక వేధింపుల లేఖ‌..

Published : Feb 13, 2022, 10:33 AM IST
Indian GM Harika Dronavalli: ఇండియ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక‌ ద్రోణ‌వ‌ల్లికి లైంగిక వేధింపుల లేఖ‌..

సారాంశం

Indian GM Harika Dronavalli: గ‌తేడాది లాత్వియాలో గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్ జ‌రుగుతున్న క్ర‌మంలో త‌న‌కు లైంగిక వేధింపుల లేఖ వ‌చ్చిందని ఇండియ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక ద్రోణ‌వ‌ల్లి వెల్ల‌డించారు. అయితే, టోర్నమెంట్‌ చివరి రోజు వరకు తనకు ఈ విషయం తెలియదనీ, టోర్నీ నిర్వాహకులు, అంతర్జాతీయ చెస్ సమాఖ్య అధికారులు ఈ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించారని హారిక తెలిపింది.

Indian GM Harika Dronavalli: తాను కూడా లైంగిక వేధింపుల లేఖల‌ను అందుకున్నాన‌ని ప్ర‌ముఖ చెస్  క్రీడాకారిణి, ఇండియ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక ద్రోణ‌వ‌ల్లి తెలిపారు. గ‌తేడాది యూర‌ప్ లోని లాత్వియాలో  గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్ జ‌రుగుతున్న క్ర‌మంలో త‌న‌కు లైంగిక వేధింపుల లేఖ వ‌చ్చిందని వెల్ల‌డించారు. అయితే,  టోర్నమెంట్‌ చివరి రోజు వరకు తనకు ఈ విషయం తెలియదనీ, టోర్నీ నిర్వాహకులు ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించారని హారిక తెలిపింది. 

వివ‌రాల్లోకుళ్తే.. గ‌తేడాది న‌వంబ‌ర్ లో లాత్వియాలోని రిగా లో జ‌రిగిన గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా అనేక మంది ప్లేయర్లకు లైంగిక వేధింపుల లేఖలు వచ్చినట్లు వెల్లడైంది. దాదాపు 15 మందికి పైగా ప్లేయ‌ర్లు అస‌భ్య‌క‌ర‌, లైంగిక వేధింపుల లేఖ‌లు అందుకున్న‌ట్టు స‌మాచారం. వీరిలో ఇండియ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్ హారిక ద్రోణ‌వ‌ల్లి (Harika Dronavalli) కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించారు. రిగాలో జ‌రిగిన గ్రాండ్ స్విస్ టోర్న‌మెంట్ (Grand Swiss tournament) జ‌రుగుతున్న సంద‌ర్భంలో తాను లైంగిక వేధింపుల‌కు సంబంధించిన లేఖ అందుకున్నానని చెప్పారు. అయితే, ఈ విష‌యం త‌న‌కు టోర్న‌మెంట్ చివ‌రివ‌ర‌కు తెలియ‌ద‌ని పేర్కొన్నారు. టోర్నీ నిర్వాహకులు, FIDE (అంతర్జాతీయ చెస్ సమాఖ్య) అధికారులు ఈ లేఖల విషయంలో సమర్థంగా వ్యవహరించారని హారిక ద్రోణ‌వ‌ల్లి చెప్పారు. 

 ‘‘రిగాలో నా పేరిట లేఖ వచ్చింది. టోర్నీ (Grand Swiss tournament) చివరి రోజు వరకు ఆ విషయం నాకు తెలియదు. చివరి రోజు వరకు లేఖల గురించి మాకు చెప్పలేదు. ఆ లేఖ వ‌ల్ల నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. లేఖలను పోలీసులకు అప్పగించారు’’ అని తెలిపింది. అలాగే, త‌న‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా నిర్వాహ‌కులు స‌మ‌ర్థ‌వంగా లేఖ‌లో విష‌యంలో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని పేర్కొంది.  ‘‘నేను ఆ లేఖను తెరవలేదు. ఎలాంటి ఇబ్బందినీ ఎదుర్కోలేదు. టోర్నీ నిర్వాహకులు, అంత‌ర్జాతీయ చెస్ స‌మాఖ్య ఫిడే.. సమస్యను ఎదుర్కొనే విషయంలో సమర్థంగా వ్యవహరించారు’’ అని హారిక (Harika Dronavalli) చెప్పింది.

అలాగే, ఈ లైంగిక వేధింపు లేఖ‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని Harika Dronavalli తెలిపింది. ఈ  లేఖ‌ల‌పై అంత‌ర్జాతీయ చెస్ స‌మాఖ్య FIDE (DescriptionThe International Chess Federation) స్పందిస్తూ..  ‘‘లేఖలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాం. ఈ విషయాన్ని లాత్వియా పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు’’ అని తెలిపింది. మొత్తం 15 మందికి పైగా క్రీడాకారులకు ఈ ఆస‌భ్య లేఖ‌లు వ‌చ్చాయి. దుండ‌గులు పంపిన ఈ లేఖ‌ల‌లో అశ్లీలత‌కు సంబంధించినవి ఉన్నాయి. అశ్లీల విషయాలను కలిగి ఉన్న ఎన్వలప్‌లు - హోటల్ గదుల్లో ఉన్న వారికి, టోర్నమెంట్‌ (Grand Swiss tournament)లో ఆటగాళ్లకు పంపబడ్డాయి. ర‌ష్యన్ క్రీడాకారులు ఈ లేఖ‌లు అందుకున్న వారిలో అధికంగా ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Sankranti Holiday Trip : కేవలం రూ.10000 బడ్జెట్ లో హాలిడే ట్రిప్.. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన టాప్ 5 స్పాట్స్