hijab row : ఏదో ఒక రోజు హిజాబీ భారత ప్రధాని అవుతారు - ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

Published : Feb 13, 2022, 10:54 AM IST
hijab row : ఏదో ఒక రోజు హిజాబీ భారత ప్రధాని అవుతారు - ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

భారతదేశానికి ఏదో ఒక రోజు హిజాబి ధరించిన వారు సీఎం అవుతారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏదో ఒక రోజు ‘హిజాబీ’ భారత ప్రధాని అవుతారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. శ‌నివారం ఉత్త‌రప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ర్యాలీలో ఆయ‌న పాల్గొని ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన క్లిప్ ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హిజాబ్ ధరించిన అమ్మాయిలు డాక్టర్లు (doctors) అవుతారని, డీఎం (DM), ఎస్ డీఎం (SDM) భారతదేశానికి ఒక రోజు ప్రధాని (prime minister) అవుతారని ఒవైసీ చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్ర‌చారంలో ఒవైసీ హిజాబ్ (hijab) అంశాన్ని తీసుకొచ్చారు. ముస్లిం బాలికలను హిజాబ్ ధరించడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు సాధికారత క‌ల్పించామ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ (prime minister narendra modi) మాట్లాడుతున్నారని చెబుతూ.. హిజాబ్ వివాదంపై ప్ర‌ధానిని ఒవైసీ ప్రశ్నించారు. ఇదేనా ఆయన బేటీ బచావో, బేటీ పఢావో నినాదం అని ఎద్దేవా చేశారు. కర్నాటక మహిళలకు సెల్యూట్ చేస్తూ.. బురఖా ధరించిన ఓ మహిళ కాషాయ గుంపులోకి వెళ్లి ‘అల్లా హు అక్బర్’ అంటూ నినాదాలు చేసిందని, ప్రతీ ముస్లింకు ఇలా ధైర్యం ఉండాల‌ని ఒవైసీ సూచించారు. 

గ‌త బుధ‌వారం కర్ణాటకలో కాషాయ కండువాలు ధ‌రించిన అబ్బాయిల ను ఎదుర్కొన్న విద్యార్థిణికి ఫోన్ చేశాన‌ని అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. “ ముస్కాన్, ఆమె కుటుంబ సభ్యులకు కాల్ చేసి మాట్లాడాను. ఆమె మతం, స్వేచ్ఛను వినియోగించుకుంటూ చ‌దువు నిబద్ధతతో చ‌దువుకుంటూ ఉండాల‌ని ప్రార్థించాను. ఆమె సాహ‌సోపేత చ‌ర్య చర్య అంద‌రికీ ధైర్యాన్ని ఇచ్చిందని నేను తెలియజేశాను” అని ఆయ‌న తెలిపారు.  

ఇదిలా ఉండ‌గా కర్నాటక హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు కూడా చేరుకుంది. హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు (karnataka high court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్య‌వ‌స‌ర విచార‌ణ జ‌రిపించాల‌ని కోర‌తూ ప‌లువురు పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. అయితే ఆ అత్య‌వ‌స‌ర పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీం కోర్టు (supreem court) నిరాక‌రించింది. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకురావడం సరైనదేనా అని ఆలోచించాలని పిటిష‌న‌ర్ల త‌రఫు న్యాయ‌వాదిని సుప్రీంకోర్టు కోరింది.

క‌ర్నాట‌క‌లోని ఉడిపి (udipi)లోని ఓ ప్రభుత్వ కాలేజీలో ఈ వివాదం గ‌త నెల‌లో మొద‌టి సారిగా వెలుగులోకి వ‌చ్చింది. కాలేజీ యూనిఫామ్ నిబంధనలను అతిక్రమించి ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి వస్తున్నారని ఇంకొందరు విద్యార్థులు వాదనలకు దిగారు. క్రమంగా అది పెద్ద వివాదంగా మారింది. క్రమంగా ఇది రాష్ట్రవ్యాప్తంగా మంటలు రాజేసింది. ఇది దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ హిజాబ్ వివాదం క‌ర్నాట‌క‌ను దాటి మిగితా రాష్ట్రాల్లోనూ వ్యాపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (puducherry)లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. పుదుచ్చేరిలోని అరియాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచ‌ర్ తరగతిలో విద్యార్థి హిజాబ్ వేసుకొని రావ‌డంతో అభ్యంతరం వ్య‌క్తం చేశారు. దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అలాగే మ‌ధ్య ప్ర‌దేశ్ (madyapradhesh)లో విద్యాశాఖ మంత్రి హిజాబ్ పై వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అక్క‌డి ప్ర‌తిప‌క్షం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ హిజాబ్ వివాదంపై ప్ర‌ముఖులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !