
దేశ రాజధాని ఢిల్లీ వ్యాక్సినేషన్‌లో ఘనత సాధించింది. మొదటి డోస్ వంద శాతం పూర్తి చేసి రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో అర్హులైన వారందరికీ మొదటి డోస్ 100 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో 148.33 లక్షల మందికి మొదటి డోసు విజయవంతంగా అందించామని ట్వీట్ చేశారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్రం పోషించిన డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సీడీవీలు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్యకర్తలందరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. డీఎం, సీడీఎం, డీఐవోల అందరికీ అభినందనలని పేర్కొన్నారు.
18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
దేశంలో 140 కోట్లను దాటిన వ్యాక్సినేషన్..
దేశంలో వ్యాక్నినేషన్ మార్క్ 140.24 కోట్లను దాటింది. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ లు అందించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 88, ఢిల్లీలో 67 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో డెల్టా వేరియంట్ కు చెందిన 6,650 కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 374 మంది మృతి చెందారు. కరోనా నుంచి 7,051 కోలుకున్నారు.
ఢిల్లీలో 192కి చేరుకున్నఒమిక్రాన్ కేసులు
గత 24 గంటల్లో ఢిల్లీలో నమోదైన కేసులతో కలిపి మొత్తం ఒమిక్రాన్ కేసులు 192కి చేరుకున్నాయి. దేశంలో ఇప్పుడు అత్యధికంగా ఢిల్లీలోనే కేసులు ఉన్నాయి. అందుకే ఆ రాష్ట్రం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. న్యూయర్, క్రిస్మస్ వేడుకలపై నిషేదం విధించింది. సభలు, సమావేశాలు, ఇతర కల్చరర్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించకోకూడదని తెలిపింది. అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలోనే ప్రజలను హాజరవనిస్తామని చెప్పింది. ఢిల్లీ మెట్రో లో ఒక కోచ్‌లో 30 మంది మాత్రమే అనుమతి ఉందని చెప్పింది. ప్రజలెవరూ గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలను నిర్వహించుకోకూడదని చెప్పింది. అలాగే తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను, పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Tax raids: వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు.. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శలు !
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రోజుకు లక్ష కేసులు నమోదైనా దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే కొత్తగా సిబ్బందిని నియమించుకున్నామని తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకులు వంటి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తప్పకుండా కరోనా నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.