లాక్ డౌన్ పొడిగించాలా, ఎత్తివేయాలా.... ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయమై ప్రజల అభిప్రాయాలను అడిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
న్యూఢిల్లీ: లాక్ డౌన్ పొడిగించాలా, ఎత్తివేయాలా.... ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయమై ప్రజల అభిప్రాయాలను అడిగారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఈ నెల 17వ తేదీ నాటికి లాక్ డౌన్ ముగియనుంది.లాక్ డౌన్ విషయమై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు విషయమై పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మరో వైపు ప్రజలను ఉద్దేశించి మోడీ మంగళవారం నాడు రాత్రి ప్రసంగించనున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయమై 1031 నెంబర్ లేదా 8800007722 లేదా delhicm.suggestions@gmail.com కు మెయిల్ చేయాలని సీఎం కోరారు.
also read:ఎయిరిండియా పైలెట్లకు తొలుత పాజిటివ్, ఆ తర్వాత నెగిటివ్: ట్విస్ట్ ఇదీ...
ఈ నెల 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపుగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని సీఎం చెప్పారు.లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
దేశంలోని ఢిల్లీలో కూడ కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న విషయం తెలిసిందే. కరోనాను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.