రోడ్డుపై ఉమ్మివేశాడు.. అతని చేతితోనే తుడిపించి...

By telugu news teamFirst Published May 12, 2020, 1:23 PM IST
Highlights

మాస్కు ధరించకపోయినా, రోడ్డుపై ఉమ్ము వేసినా, గుంపులు గుంపులుగా తిరిగినా భారీ చలానాలు విధించడమేగాక, తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే చండీఘర్‌లో జరిగిన ఘటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. 
 

కరోనా వైరస్ మన దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతానికి లాక్ డౌన్ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే.. చాలా మంది లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్నారు. అక్కడితో ఆగకుండా కొందరు చెత్త పనులు చేస్తున్నారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే పనులు చేస్తున్నారు. దీంతో.. వారికి పోలీసులు అలాంటి పనిష్మెంట్లే ఇస్తున్నారు. తాజాగా ఓ యువకుడికి అధికారులు ఇచ్చిన పనిష్మెంట్ నెట్టింట వైరల్ గా మారింది.

 లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మాస్కు ధరించకపోయినా, రోడ్డుపై ఉమ్ము వేసినా, గుంపులు గుంపులుగా తిరిగినా భారీ చలానాలు విధించడమేగాక, తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే చండీఘర్‌లో జరిగిన ఘటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

హాయిగా టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు నడిరోడ్డుపై ఉమ్మి వేశాడు. అయితే తనను ఎవరూ గమనించడం లేదనుకున్న సదరు యువకుడిని ఓ అధికారి చూశాడు. వెంటనే అతన్ని ఆపి బుద్ధొచ్చేలా శిక్ష వేశాడు. సాధారణ చలాన్లతో పని కాదనుకున్న ఆయన.. అక్కడికక్కడే శుభ్రం చేయించాడు. అయితే సదరు యువకుడు స్వహస్తాలతో క్లీన్ చేయడం విశేషం. ఓ వాహనదారుడికి చండీఘర్ ట్రాఫిక్ పోలీసులు విధించిన పనిష్మెంట్ ఇది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

click me!