కెఇఎ బ్లూటూత్ స్కామ్ : పరారీలో ప్రధాన నిందితుడు ఆర్‌డి పాటిల్.. పిఎస్‌ఐ మాల్‌ప్రాక్టీస్‌లోనూ అతనే సూత్రధారి..

By SumaBala Bukka  |  First Published Oct 30, 2023, 12:43 PM IST

కర్ణాటక బ్లూటూత్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఆర్డీ పాటిల్ పరారీలో ఉన్నాడు. కేఈఏ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌ చేస్తూ పట్టుబడి, అరెస్టైన వారి వాంగ్మూలం ప్రకారం అతడి గురించి పోలీసులు వెతుకుతున్నారు.  


కర్నాటక : కర్ణాటకలో బ్లూటూత్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి ఆర్‌డి పాటిల్ పరారీలో ఉన్నాడు.  పిఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలో అవకతవకలకు గానూ కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ (కెఇఎ) ఆర్‌డి పాటిల్ ఎ-1గా గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహించిన కన్నడ పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. వీటిలో మూడు కేంద్రాలు కలబురగిలో, ఐదు పరీక్షా కేంద్రాలు యాదగిరిలో  ఉన్నాయి. 

ఆర్డీ పాటిల్ స్వగ్రామమైన కలబురగిలోని అఫ్జల్‌పూర్‌లోని పరీక్షా కేంద్రంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈ కేంద్రంలోని అవకతవకలకు సంబంధించి ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఆర్‌డి పాటిల్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా, ఎ-1గా చేర్చారు. పాటిల్, అతని సహచరులు బ్లూటూత్ పరికరాలను సరఫరా చేసి సరైన సమాధానాలు చెప్పినట్లు అరెస్టయిన వారి వాంగ్మూలాల ఆధారంగా గుర్తించారు. వీటి ఆధారంగా పాటిల్ ప్రమేయం నిర్ధారించబడిందని కలబురగి ఎస్పీ అడ్డూర్ శ్రీనివాసులు తెలిపారు.

Latest Videos

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీష్ సిసోడియాకు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం..

2021లో జరిగిన పీఎస్ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షలో చట్టవిరుద్ధమైన బ్లూటూత్ వినియోగం జరిగింది. ఇప్పుడు అదే పునరావృతం అయ్యింది. దీంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది తీవ్ర ప్రజాగ్రహానికి దారితీసింది. దీంతో, అధికారులు ఆర్ డీ పాటిల్ సహా 107 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన పాటిల్ ఇప్పుడు మరో పరీక్షా మాల్‌ప్రాక్టీస్ కేసులో ఇరుక్కుని పోలీసులకు చిక్కాడు.

కెఇఎ పరీక్ష అవకతవకలు వెలుగులోకి రావడంతో ఆర్‌డి పాటిల్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. శనివారం రాత్రి అతని కోసం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెతకడం ప్రారంభించాయి. పాటిల్ పట్టుబడకుండా  మహారాష్ట్ర లేదా ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అతడిని గుర్తించి పట్టుకునేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీవైఎస్పీ) నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
యాదగిరిలో అరెస్టయిన వ్యక్తులందరూ కలబురగి పరిధిలోని అఫజల్‌పూర్, విజయపుర జిల్లాలకు చెందినవారు. 

వారి దగ్గరినుంచి అధికారులు ఎనిమిది మొబైల్ ఫోన్‌లు, నాలుగు బ్లూటూత్ పరికరాలు, రెండు వాకీ-టాకీలు, షర్టులు, అండర్‌షర్టులు, అండర్‌గార్మెంట్‌లతో సహా ప్రత్యేక దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేఈఏ పరీక్ష అక్రమాలకు సంబంధించి అరెస్టయిన 18 మందిలో తొమ్మిది మందిని ఆదివారం సాయంత్రం కోర్టు ముందు హాజరుపరిచారు.  వారికి 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

కేఈఏ పరీక్షలో చీటింగ్‌కు తోడ్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పరీక్షకు హాజరవుతున్న తన తోబుట్టువు శైలశ్రీ తల్వార్‌కు ఆమె బ్లూటూత్ ద్వారా సమాధానాలు చెబుతోంది. కలబురగిలోని ఒక పరీక్షా కేంద్రం వెలుపల ఈ సంఘటన జరిగింది. అక్కను కారులో కూర్చోబెట్టి, ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా శైలశ్రీకి సరైన సమాధానాలు చెప్పినట్లు సమాచారం.

click me!