ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా అస్వస్థత.. వాంతులు, విరేచనాలతో అవస్తలు పడ్డ భక్తులు..

By Asianet News  |  First Published Oct 30, 2023, 10:56 AM IST

ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్స్ చికిత్స పొందుతున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.


ప్రసాదం తిని వెయ్యి మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అవస్తలు పడ్డారు. దీంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్స్ అన్నీ బాధితులతో నిండిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం భక్తులంతా చికిత్స పొందుతున్నారు. దీనిపై స్టానిక అడ్మినిస్ట్రేటివ్ విచారణ జరుపుతోంది.

‘ఈటీవీ భారత్’ కథనం ప్రకారం.. ఝాన్సీ జిల్లాలోని పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరోడా గ్రామంలో అక్టోబర్ 27వ తేదీన మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో త్రయోదశి కార్యక్రమం జరిగింది. ఈ కుటుంబ సమేతంగా 2000 కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. అందులో చాలా మంది అక్కడే ప్రసాదం తిని, భోజనాలు చేశారు. అయితే కొంత సమయం తరువాత అనేక మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 

Latest Videos

undefined

దీంతో కొంత సమయంలోనే దగ్గరలోని పూంఛ్, సమతార్, మంత్లోని దాదాపు అన్ని హాస్పిటల్స్ లో ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరూ చేరడం మొదలైంది. పలువురికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని ఝాన్సీకి, మరి కొందరిని గ్వాలియర్ లోని హాస్పిటల్స్ కు పంపించారు. ఆదివారం కూడా కస్బా పూంచ్, సామ్తార్ హాస్పిటల్ లోని రోగులను మంత్ సీహెచ్ సీకి రిఫర్ చేశారు. ఆ హాస్పిటల్స్ కు అంబులెన్స్ లు వస్తూనే ఉన్నాయి. 

కాగా.. రోగులకు సరిపోయే అన్ని అంబులెన్స్ లు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్డీఎం మనోజ్ కుమార్ సరోజ్, మంత్ సీహెచ్ సీ సూపరింటెండెంట్ మాతా ప్రసాద్ రాజ్పుత్ బరోడా గ్రామానికి చేరుకుని రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తనయుడు రాహుల్ రాజ్‌పుత్ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వేగంగా వ్యాప్తి చెందటంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆ గ్రామానికి చేరుకుంది. విచారణ చేపట్టింది. ఆహార పదార్థాల నమూనాను పరీక్ష కోసం ల్యాబ్స్ కు పంపించారు. కాగా..  ఈ ఘటనపై మాజీ ప్రధాన్ లఖన్ సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ఈ త్రయోదశి కార్యక్రమానికి సమీపంలోని నలభై గ్రామాలను ఆహ్వానించినట్లు చెప్పారు. ఇందులో సుమారు రెండున్నర వేల మంది పాల్గొన్నారని చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థి ఎవరైనా ఆహారంలో విషపదార్థాలు కలిపి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 
 

click me!