కథువా : రంజిత్ సాగర్ డ్యాంలో కూలిన ఆర్మీ విమానం, ఇద్దరి ఆచూకీ గల్లంతు

By AN TeluguFirst Published Aug 3, 2021, 1:57 PM IST
Highlights

‘ఆర్మీ హెలికాప్టర్ లేక్ లో  కూలిపోయినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేము మా బృందాలను ఘటనా స్థలానికి తరలించాం" అని లంబా చెప్పారు. 

జమ్మూ: జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉన్న రంజిత్ సాగర్ డ్యామ్ వద్ద ఓ హెలికాప్టర్ కూలిపోయింది. భారత సైన్యానికి చెందిన ఈ చాపర్  డ్యామ్ మీద గస్తీ తిరుగుతోంది. ఆ క్రమంలో ఒక్కసారిగా కూలిపోయింది. భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

హెలికాప్టర్ ను వెతికి, సహాయచర్యలు చేపట్టడానికి ఒక NDRF బృందాన్ని నియమించారు. హెలికాప్టర్‌లో ముగ్గురు  ఉన్నారని చెబుతున్నారు. భారత సైన్యానికి చెందిన ఈ ఛాపర్ రెగ్యులర్ గా గస్తీలో ఉంటుంది. 

‘ఆర్మీ హెలికాప్టర్ లేక్ లో  కూలిపోయినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేము మా బృందాలను ఘటనా స్థలానికి తరలించాం" అని లంబా చెప్పారు. 254 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్ కు చెందిన ఈ హెలికాప్టర్ మామున్ కాంట్ నుండి ఉదయం 10:20 గంటలకు బయలుదేరింది. హెలికాప్టర్ రంజిత్ సాగర్ డ్యామ్ ప్రాంతంలో లో-లెవల్ లో గస్తీ తిరుగుతోంది. ఆ సమయంలోనే అది కూలిపోయింది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని ఆయన తెలిపారు. అయితే, హెలికాప్టర్ ఆనకట్టలో మునిగిపోయిందని ఏబిపి న్యూస్ లో దీనికి సంబంధించిన దృశ్యాలు టెలికాస్ట్ అవుతున్నాయి. దీని తాజా అప్‌డేట్‌ల ప్రకారం, హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ ఎఎస్ భట్, కెప్టెన్ జయంత్ జోషి అచూకీ తెలియడం లేదు. 

click me!