సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షా ఫలితాల విడుదల: గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత

By narsimha lodeFirst Published Aug 3, 2021, 12:19 PM IST
Highlights

 
 సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలను బోర్డు మంగళవారం నాడు  విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగిందని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
 

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల జాబితాలనుత digilocker.gov.in లేదా umang యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.గత ఏడాది 18,85,885 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. ఇందులో 17,13,121 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.46శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని సీబీఎస్ఈ తెలిపింది.

2019లో 91.1 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్ పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే  ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్దతి ద్వారా  విద్యార్థులకు మార్కులను కేటాయించారు.స్కూల్‌లో నిర్వహించిన అంతర్గత పరీక్షల ద్వారా 20 మార్కలు, యూనిట్ పరీక్షలకు 10 మార్కులు కేటాయించారు. 30 మార్కులను అర్ధవార్షిక పరీక్షలకు కేటాయించారు.  40 మార్కులను ఫ్రీబోర్డుకు కేటాయించారు.కరోనా కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కూడ రద్దు చేశారు. జూలై చివరి వారంలో ఈ పరీక్ష ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. బాలుర కంటే బాలికలే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. 

click me!