ప్రేమజంట మృతదేహాలకు స్మశానంలో పెళ్లి.. బతికిఉనప్పుడు ఒప్పుకోలేదు.. ఆత్మహత్య చేసుకున్నాక..

Published : Aug 03, 2021, 11:58 AM IST
ప్రేమజంట మృతదేహాలకు స్మశానంలో పెళ్లి.. బతికిఉనప్పుడు ఒప్పుకోలేదు.. ఆత్మహత్య చేసుకున్నాక..

సారాంశం

ఈ ఘటనతో షాక్ అయిన బంధువులు వారి మృతదేహాలకు పెళ్లి చేసి, తమ తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేశారు.  మహారాష్ట్రలోని మాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వారిద్దరూ మేజర్లు. ఒకే కులానికి చెందిన వాళ్ళు.  ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని.. కలిసి బ్రతుకుదాం అనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.  దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు చావులోనైనా కలిసి ఉందామనుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ ఘటనతో షాక్ అయిన బంధువులు వారి మృతదేహాలకు పెళ్లి చేసి, తమ తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేశారు.  మహారాష్ట్రలోని మాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మా డే గ్రామానికి చెందిన ముఖేష్, నేహా కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ధరిదీ ఒకే కులం కావడంతో తమ ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారని భావించారు.  అందుకే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.  అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు.  ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు.

దీంతో ఈ ప్రేమజంట తీవ్ర మనస్తాపం చెందింది.  ఇక తామిద్దరినీ కలిసి బతకనివ్వరని నిర్ణయానికి వచ్చారు. విడిపోయి బతకలేం అనుకున్నారు. దీంతో ఆదివారం నాడు నేహా ఇంట్లో ఇద్దరు కలుసుకున్నారు.  ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు.  ఇది చూసిన నేహా కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. ఆ తరువాత మృతదేహాలను ఇరు కుటుంబాలకు అందజేశారు. వారి మృతితో తాము చేసిన తప్పేంటో తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఆ ప్రేమజంట చివరి కోరిక నెరవేర్చేందుకు ముందుకు వచ్చారు.

స్మశానం లోనే రెండు మృతదేహాలకు పెళ్లి చేశారు. ఇద్దరికీ దండలువేసి అంత్యక్రియలు నిర్వహించారు.  ఇది ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. అనవసరపు పంతాలకు పోయి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని, ఆ తరువాత తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారని.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారు. వారి ప్రేమను ముందుగానే అంగీకరించి పెళ్లి చేస్తే ఇద్దరూ కలకలలాడుతూ కాపురం చేసుకునే వారు కదా అని విమర్శిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌