ప్యాడ్ వుమన్ ఇర్ఫానా సమాజ సేవ.. ‘మగాళ్లు పాలరాతి భవనాలనైనా కడతారు కానీ మహిళకు శానిటరీ నాప్కిన్ కొనివ్వరు’

Published : May 16, 2023, 01:40 PM ISTUpdated : May 16, 2023, 01:42 PM IST
ప్యాడ్ వుమన్ ఇర్ఫానా సమాజ సేవ.. ‘మగాళ్లు పాలరాతి భవనాలనైనా కడతారు కానీ మహిళకు శానిటరీ నాప్కిన్ కొనివ్వరు’

సారాంశం

కశ్మీర్‌లో ప్యాడ్‌ వుమన్‌గా పేరుగాంచుతున్న ఇర్ఫానా జర్గార్ తనకు వచ్చిన జీతంలో కొంత భాగాన్ని శానిటరీ ప్యాడ్‌లు కొనడానికే వెచ్చిస్తుంది. వాటిని సుమారు అవసరమైన 500 మందికి పంపిణీ చేస్తున్నది. పబ్లిక్ టాయిలెట్లలోనూ శానిటరీ ప్యాడ్‌లను అందుబాటులో ఉంచుతున్నది. రుతస్రావం చుట్టూ అలుముకున్న జాఢ్యాన్ని తొలగించడానికి అవగాహన కార్యకర్మాలు నిర్వహిస్తున్నారు. మగాళ్లు తమ భార్యలను, ఆడవాళ్లపట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు.  

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్యాడ్ వుమన్‌గా పేరున్న ఇర్ఫానా జర్గార్ మెన్‌స్ట్రువల్ హెల్త్ గురించి, హైజీన్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రుతుచక్రం చుట్టూ పేరుకున్న నిషిద్ధ సంకెళ్లను ధ్వంసం చేస్తూ ప్రజల మనస్తత్వాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తనకు వీలైనంత మందికి తన జీతం డబ్బులతో ఖర్చు పెట్టి శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తున్నారు.

శ్రీనగర్‌లో ప్రతి నెలా సుమారు 500 మంది మహిళలకు శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నారు. నెలలో రుతుస్రావం జరిగే ఆ ఐదు రోజుల్లో సదరు మహిళ గురించి ఎందుకు కేర్ తీసుకోవాలో పురుషులకూ అవగాహన కల్పిస్తున్నారు. ‘కశ్మీర్‌లో ఎక్కడపడితే అక్కడ ఇళ్లు కట్టే పురుషులు.. వాటిపై లక్షలు వెచ్చిస్తారు. మార్బుల్ ఫ్లోరింగ్ కోసమూ డబ్బులు ఖర్చు పెడతారు. కానీ, వారి జీవితంలో ఒక్కసారైన ఆడవారికి రూ. 40 పెట్టి శానిటరీ ప్యాడ్ కొనివ్వరు’ అని ఇర్ఫానా దీదీ అంటారు.

‘ఇంటి పనులు చేసి కుటుంబ ఆలనా పాలనా చూసి పిల్లలను కనే మహిళలు యంత్రాలేమీ కాదు. పీరియడ్స్‌కు ముందు, పీరియడ్స్ జరుగుతున్న సమయంలో వారు మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఉదర  నొప్పులను ఎదుర్కొంటారు. ఆ సమయంలో వారి బాగోగులను చూసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఇర్ఫానా తన క్యాంపెయిన్‌లో ప్రజలకు వివరిస్తూ ఉంటారు.

ఆవాజ్ ది వాయిస్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. తనకు వచ్చే జీతంలో కొంత డబ్బులు ఖర్చు పెట్టి శానిటరి ప్యాడ్‌లు కొంటానని, మరింత మంది మహిళలకు తన సహకారం అందడానికి బయటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని వివరించారు. 

Also Read: బస్సులో మహిళకు ప్రసవం.. పురుడు పోసిన మహిళా కండక్టర్.. ఎక్కడంటే..

పీరియడ్స్ సమయంలో అశుభ్రంగా ఉండటం మూలంగా వచ్చే సమస్యల గురించీ ఆమె చెబుతారు. కొన్నిసార్లైతే వారి వివాహ బంధమే తెగిపోయే ముప్పు ఏర్పడుతుందని వివరించారు. వెజీనల్, యుటేరస్ ఇన్ఫెక్షన్స్, పీసీవోడీ వంటి సమస్యలు వార ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలతో విడాకులు పొందిన మహిళలూ తనకు తెలుసు అని వివరించారు. అందుకే తనకు వీలైనంత మందికి శానిటరీ ప్యాడ్స్ అందిస్తానని, సుమారు 19 పబ్లిక్ టాయిలెట్లలో వీటిని అందుబాటులో ఉంచుతున్నానని తెలిపారు. తన సేవకు గాను ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, నటి రవీనా టాండన్‌లు ఆమె సేవను సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్నారు.

ఇర్ఫానా జర్గార్ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హెల్ప్‌లైన్ హ్యాండిల్ చేస్తుంది. తన మిషన్‌ స్పాన్సర్షిప్ కోసం అనేక ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలను అప్రోచ్ అయ్యానని, కానీ, ఎలాంటి సహాయం అందలేదని ఇర్ఫానా తెలిపారు.

తన తొమ్మిదేళ్ల స్వచ్ఛంద సేవలో కశ్మీర్‌లోని అనేక పబ్లిక్ టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నట్టు చూశానని వివరించారు. ఎక్కడ టాయిలెట్లలో శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులో ఉంచడం లేదని తెలిపారు. శ్రీనగర్ స్మార్ట్ సిటీగా మారిందని, అయినా.. పబ్లిక్ టాయిలెట్లు మాత్రం అపరిశుభ్రంగానే ఉన్నాయని, శానిటరి ప్యాడ్‌లు అందుబాటులో ఉంచరని చెప్పారు. 

ఇటీవలే తాను ఓ మసీదుకు వెళ్లానని, అక్కడ కూడా టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం బాధనిపించిందని వివరించారు. టాయిలెట్లు శుభ్రంగా లేకుంటే మహిళలకు ఇన్ఫెక్షన్లు సోకే ముప్పు ఎక్కువని తెలిపారు. చ్రార్ ఎ షరీఫ్ వద్ద మహిళలకు, పురుషులకు తాను ఓ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించినట్టు చెప్పారు. అప్పుడు ఓ పెద్దావిడ తన వద్దకు వచ్చి సిగ్గుపడే ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావని తనను అడిగారని వివరించారు.

‘ఇదంతా ఒక బయలాజికల్ ఫెనామినా అని ఆమెకు వివరించాను. ఈ విషయాలు మాట్లాడటంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అల్లా ఆశీర్వాదంతోనే మహిళల్లో ఈ ప్రక్రియ ఉన్నదని వివరించాను. ఇదే ఫెనామినా ఆమె కూతుళ్లు, కోడళ్లు, మనవరాళ్లు, ఆమె ఆప్తులకు కూడా జరుగుతుందనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పాను. కాబట్టి అలాంటి సమయాల్లో వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వివరించాను’ అని చెప్పినట్టు ఇర్ఫానా తెలిపారు.

అప్పుడు ఆమె ఆలోచనలో పడిందని, ఆ తర్వాత తనను ఆశీర్వదించిందని వివరించారు. ఆమెకు శానిటరీ ప్యాడ్లు ఇచ్చి పంపించానని తెలిపారు. అల్లా దృష్టిలోనూ ఇది సకార్యం అని తాను నమ్ముతున్నట్టు వివరించారు. తన అవగాహన కార్యక్రమాల తర్వాత కొందరు పురుషుల్లోనూ మార్పు వచ్చిందని, వారు తమ భాగస్వాములను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పినట్టు వివరించారు.

ఒకసారి తాను ఫేస్‌బుక్ లైవ్‌లో డొనేట్ వన్ ప్యాడ్ అనే కార్యక్రమంలో మాట్లాడుతుండగా..ఒకరు తన తల్లికి చూపించారని, ఆమె వెంటనే ఫోన్ చేయగా.. కార్యక్రమంలో మధ్యలోనే మాట్లాడనని ఇర్ఫానా తెలిపారు. తాను చేస్తున్న కార్యక్రమాల పట్ల తల్లి గర్వపడుతున్నట్టు వివరించడం సంతోషాన్నిచ్చిందని చెపపారు. 

 

--ఆశా ఖోసా

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu