ఖర్గేతో రాహుల్ భేటీ,ఢీల్లీకి చేరిన డీకే శివకుమార్: కర్ణాటక సీఎం అభ్యర్ధిపై కాంగ్రెస్ కసరత్తు

Published : May 16, 2023, 01:30 PM IST
ఖర్గేతో  రాహుల్ భేటీ,ఢీల్లీకి  చేరిన డీకే శివకుమార్: కర్ణాటక  సీఎం అభ్యర్ధిపై కాంగ్రెస్  కసరత్తు

సారాంశం

కర్ణాటక  సీఎం  పదవికి  ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై   ఆ పార్టీ నాయకత్వం చర్చలు ప్రారంభించింది.  ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్  ఇవాళ భేటీ అయ్యారు.

న్యూఢీల్లీ: కర్ణాటక  సీఎం  పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  కసరత్తు ప్రారంభించింది.  ఎఐసీసీ  చీఫ్ మల్లికార్జున ఖర్గే  నివాసానికి  ఆ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ   చేరుకున్నారు.  కర్ణాటక సీఎం పదవికి  అభ్యర్ధిని ఎంపిక  చేసే విషయమై  ఆ పార్టీ  అగ్ర నేతలు  చర్చిస్తున్నారు. మరోవైపు కర్ణాటకకు  చెందిన  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా  మల్లికార్జున ఖర్గే నివాసానికి  చేరుకుంటున్నారు.  ఇవాళ  మధ్యాహ్నం  ఒంటి గంటకు  డీకే శివకుమార్ న్యూఢీల్లికి  చేరుకున్నారు.  

 ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు  కర్ణాటక సీఎం సిద్దరామయ్య,  కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లు కూడ ఖర్గే  నివాసానికి  చేరుకుంటారు.  సిద్దరామయ్య, డీకే శివకుమార్ లతో  ఖర్గే,  రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్   భేటీ కానున్నారు.  

కర్ణాటక సీఎం పదవికి  ఎంపిక పై  తమ ప్రతిపాదనను  కాంగ్రెస్ నాయకత్వం   డీకే శివకుమార్, సిద్దరామయ్య ముందుంచనున్నారు. కర్ణాటక సీఎం పదవిని  ఎవరికి  ఇవ్వనున్నారనే విషయమై  ఇవాళ స్పష్టత  వచ్చే అవకాశం ఉంది.

also read:కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా: న్యూఢిల్లీకి బయలుదేరిన డీకే శివకుమార్

కర్ణాటక సీఎం పదవి కోసం  సిద్దరామయ్య, డీకే శివకుమార్ లు పోటీ పడుతున్నారు.   ఆదివారంనాడు  జరిగిన సీఎల్పీ సమావేశంలో  ఎమ్మెల్యేల అభిప్రాయాలను   పార్టీ పరిశీలకులు  ఇప్పటికే  మల్లికార్జున ఖర్గేకు  అందించారు.   అనారోగ్య కారణాలతో  డీకే శివకుమార్  నిన్న న్యూఢీల్లికి చేరలేదు.  ఇవాళ  ఆయన న్యూఢీల్లికి చేరుకున్నారు. దీంతో  కర్ణాటక సీఎం పదవి  ఎంపికపై  కాంగ్రెస్ నాయకత్వం  ఇవాళ  సీఎం పదవికి అభ్యర్ధి ఎంపిక కసరత్తును  ప్రారంభించింది. సిద్దరామయ్యకు  సీఎం పదవిని అప్పగిస్తే  డీకే శివకుమార్  ను ఎలా  సంతృప్తి పరుస్తారనే విషయమై  స్పష్టత రాలేదు.  

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  డీకే శివకుమార్  సోదరుడు  డీకే సురేష్  నిన్న రాత్రి సమావేశమయ్యారు.  నిన్ననే న్యూఢిల్లీకి  చేరిన సిద్దరామయ్య  కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు  నిర్వహిస్తున్నారు. ఇవాళ  న్యూఢిల్లీకి  చేరిన  డీకే శివకుమార్  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో  కూడా సమావేశం కావాలని  భావిస్తున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే  శివకుమార్  నిన్న  కీలక వ్యాఖ్యలు చేశారు.  పార్టీ గెలుపులో  తన పాత్ర విస్మరించలేమన్నారు.  తాను వన్ మ్యాన్  ఆర్మీ అని  డీకే  శివకుమార్ తెలిపారు.  నిన్న సాయంత్రానికి  డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలపై  వెనక్కు తగ్గారు.  గెలిచిన  ఎమ్మెల్యేలంతా  తనవారేనని  చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు