అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Published : Oct 28, 2021, 12:49 PM ISTUpdated : Oct 28, 2021, 12:50 PM IST
అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

సారాంశం

కశ్మీర్ అందాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా ( Home Minister Amit Shah).. భారత దేశ కిరీటంలో ఆభరణం కశ్మీర్ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులను స్వాగతించడానికి కశ్మీర్ (Kashmir) సిద్దంగా ఉందని పేర్కొన్నారు. 

కశ్మీర్ చాలా అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఏడాది పొడువునా అందమైన దృశ్యాలు చూడొచ్చు. కశ్మీర్‌లోని ప్రకృతి అందాలను చూస్తే వేరే లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోంది. కశ్మీర్‌ను భూలోక స్వర్గంగా పిలుస్తారు. ముఖ్యంగా శీతకాలంలో కశ్మీర్ అందాలను చూసేందుకు భారీగా పర్యాటకులు అక్కడిక చేరుకుంటారు. అక్కడ ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. తాజాగా కశ్మీర్ అందాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా ( Home Minister Amit Shah).. భారత దేశ కిరీటంలో ఆభరణం కశ్మీర్ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులను స్వాగతించడానికి కశ్మీర్ సిద్దంగా ఉందని పేర్కొన్నారు. 

అమిత్ షా షేర్ చేసిన ఫొటోల్లో.. మంచుతో కప్పబడిన పర్వతాలు.. వాటిని ముద్దాడుతున్న సూర్య కిరణాలు.. చూడటానికి కనులవిందుగా ఉంది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir) మూడు రోజులు పర్యటించిన అమిత్ షా.. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఈ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. శ్రీనగర నుంచి ఢిల్లీ వస్తున్నప్పుడు ఈ ఫొటోలను తీసినట్టుగా షా పేర్కొన్నారు. 

 

‘నేను శ్రీనగర్ నుండి ఢిల్లీకి వెళుతున్నప్పుడు.. ఈ సీజన్‌లో మొదటి హిమపాతం‌తో పీర్ పంజాల్ పర్వత శ్రేణి (Pir Panjal mountain range) యొక్క ఈ బ్రీత్ టేకింగ్ పిక్చర్స్‌ను క్యాప్చర్ చేశాను. భారతదేశ కిరీటంలో ఆభరణమైన కాశ్మీర్ పర్యాటకులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. భారతదేశంలోని ఈ అందమైన ప్రాంతాన్ని సందర్శించండి’ అని అమిత్ షా పేర్కొన్నారు. #IncredileIndia అనే ట్యాగ్‌ను కూడా షా ఆ పోస్ట్‌కు జతచేశారు. 

Also read: మెట్రోపై సజ్జనార్ వార్..? వామ్మో మాములుగా లేదుగా.. ఈ వీడియో చూడండి..

తన మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం ప్రసిద్ద దాల్ సరస్సు వద్ద జమ్మూ కశ్మీర్ పర్యాటక శాఖ నిర్వహించిన హౌస్ బోట్ ఫెస్టివల్‌ను అమిత్ షా ప్రారంభించారు. కశ్మీర్‌ పర్యటనలో భాగంగా అమిత్‌ షా ఈ ఏడాది జూన్‌లో మిలిటెంట్ల చేతిలో హతమైన పోలీసు అధికారి పర్వీజ్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల కాలంలో లోయలో పెరిగిన చొరబాట్లు, పౌరుల హత్యల నేపథ్యంలో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశంలో అమిత్‌షా భద్రతా పరిస్థితులను కూడా సమీక్షించారు.

Also read: తెలంగాణ కాంగ్రెస్ యువనేతకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు.. రేవంత్‌ రెడ్డికి చెక్?

కశ్మీర్‌లో మొదలైన హిమాపాతం..
 కొద్ది రోజుల క్రితం కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో ఈ సీజన్ తొలి హిమపాతం నమోదైంది. అయితే కశ్మీర్ లోయలోని మైదానాల్లో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. ఇది శీతాకాలం పరిస్థితులకు ఆహ్వానం పలికినట్టు అయింది. లద్దాఖ్‌లోని మినామార్గ్, ద్రాస్‌ ప్రాంతాల్లో కూడా మంచు కురుస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్