కాశీ విశ్వనాథుని దర్శనాలకు బ్రేక్.. మూడు రోజులపాటు దేవాలయం మూసివేత.. ఎందుకంటే...

By AN TeluguFirst Published Nov 25, 2021, 12:33 PM IST
Highlights

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. ఇటీవలే ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి వందేళ్ల క్రితం దొంగిలించబడిన మహిమాన్వితమైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుంచి ఈ నెలలో భారత ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ (Kashi) విశ్వనాథుని దర్శనాలకు మూడు రోజులపాటు బ్రేక్‌పడనుంది. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి.

కాగా,  దశాబ్దాల క్రితం భారత్ నుంచి ఛోరీని గురైన అరుదైన దేవతామూర్తుల విగ్రహాలను, కళాఖండాలను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుం కట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే.. ప్రముఖ పుణ్యక్షేత్రం varanasi నుంచి వందేళ్ల క్రితం దొంగిలించబడిన మహిమాన్వితమైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుంచి ఈ నెలలో భారత ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చింది. 

ఈ అరుదైన విగ్రహం దాదాపు 100 సంవత్సరాల క్రితం దొంగిలించబడినట్లు అధికారులు చెబుతున్నారు. కెనడా నుంచి annapurna devi స్వదేశానికి చేరుకున్న అనంతరం పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి g. kishan reddy అన్నపూర్ణా దేవి విగ్రహానికి ఈ నెల 11న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

భారతదేశ నాగరికత, సాంస్కృతిక వైభవాన్ని గౌరవించే రోజంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా యూపీలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పున:ప్రతిష్ట నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో భక్తులు ఇకనుంచి అన్నపూర్ణ దేవి కృపను, ఆశీర్వచనాన్ని కూడా పొందవచ్చని ఆయన అన్నారు.  గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చారిత్రాత్మక విగ్రహాలను స్వదేశానికి తీసుకొస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, కాశీ విశ్వనాథ ఆలయం - జ్ఞానవాపి మసీదు వివాదానికి తెరపడింది. ఈ కేసులో మతసామరస్యం వెల్లి విరిసింది. 2021, జులై 22న కాశీ విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. ఇందుకు ప్రతిగా, జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఆలయ పాలకవర్గం అప్పగించింది.

వందేళ్ల క్రితం చోరీ.. ఇన్నేళ్లకు భారత్‌కి చేరిన అన్నపూర్ణా దేవి విగ్రహం, కాశీలో పున: ప్రతిష్టకు ఏర్పాట్లు

కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉందని.. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోందని అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.వాసిన్ తెలిపారు. వాళ్లు స్థల స్వాధీనం చేయాలని కోరుతుండటంతో ఈ విషయాన్ని మా వాళ్లతో చర్చించామని వెల్లడించారు. దీంతో Kashi Vishwanath Temple కారిడార్ కోసం 1700 చదరపు అడుగులు అప్పగించేందుకు Mosque Board అంగీకరించింది అని వాసిన్ పేర్కొన్నారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. మందిరం-మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కోర్టు.. ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. 

అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసినట్టుగా తెలుస్తోంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి వాదిస్తున్నారు. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
 

click me!