వరుస ట్వీట్లతో కరుణానిధి మోడీ సంతాపం: రేపు చెన్నైకి

First Published Aug 7, 2018, 8:17 PM IST
Highlights

డిఎంకె అధినేత కరుణానిధికి సంతాపం ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వరుస ట్వీట్లు చేశారు. కరుణానిధి మృతి తనకు ఎనలేని విచారాన్ని కలిగించిందని ఆయన అన్నారు. భారతదేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో కరుణానిధి ఒక్కరని అన్నారు.

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధికి సంతాపం ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వరుస ట్వీట్లు చేశారు. కరుణానిధి మృతి తనకు ఎనలేని విచారాన్ని కలిగించిందని ఆయన అన్నారు. భారతదేశంలోని అత్యంత సీనియర్ నేతల్లో కరుణానిధి ఒక్కరని అన్నారు. 

జీవితాన్ని పేదల సంక్షేమానికి అంకితం చేసిన ప్రజా నాయకుడిని, ఆలోచనాపరుడిని, ప్రముఖ రచయితను, దిగ్గజాన్ని  కోల్పోయామని ఆయన అన్నారు. ప్రధాని రేపు బుధవారం చెన్నై రానున్నారు. 

పలు సందర్భాల్లో కరుణానిధితో మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని ఆయన అన్నారు. విధానాలను అర్థం చేసుకుని సామాజిక సంక్షేమం కోసం నిలబడిన నేతగా ఆయన కరుణానిధిని అభివర్ణించారు. ప్రజాతంత్ర ఆదర్శాల కోసం నించున్న నేతగా, అత్యవసర పరిస్థితిని ఎదుర్కున్న నాయకుడిగా ఆయన గుర్తుంచుకుంటామని అన్నారు. 

కరుణానిధిని ఆయన గత నవంబర్ లో కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి చెన్నై వచ్చిన మోడీ ఆయనను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన గోపాలపురంలోని నివాసంలో కరుణానిధితో ఉన్నారు. కరుణానిధి చేతులు పట్టుకుని మోడీ మాట్లాడారు. 

విశ్రాంతి కోసం ఢిల్లీ రావాలని నరేంద్ర మోడీ కరుణానిధిని ఆహ్వానించినట్లు కనిమొళి చెప్పారు .

click me!