విషమించిన కరుణానిధి ఆరోగ్యం: హెల్త్ బులిటెన్ విడుదల

First Published Aug 6, 2018, 6:54 PM IST
Highlights

డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఆయన చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యులు సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

చెన్నై: డిఎంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఆయన చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వైద్యులు సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కిడ్నీకి, కాలేయానికి ఇన్ ఫెక్షన్ సోకినట్లు వారు చెప్పారు. కరుణానిధి బంధువులు, అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

94 ఏళ్ల వయస్సు గల కరుణానిధికి సంబంధించిన కీలకమైన అవయవాలను కండీషన్ లో కండీషన్ లో పెట్టడం సవాల్ గానే ఉందని వారు చెప్పారు.  గుండె, ఊపిరితిత్తులు పనిచేస్తున్నప్పటికీ వయస్సు కారణంగా రుగ్మతలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. నిపుణులైన వైద్యులు చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే 24 గంటల్లో జరిగే చికిత్సకు కరుణానిధి శరీరాన్ని స్పందించడాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేస్తామని చెప్పారు.   

click me!