ఆవుపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు...దేవాలయ సమీపంలోనే

First Published 6, Aug 2018, 6:22 PM IST
Highlights

చిన్నారులు, మహిళలనే కాదు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు మూగ జీవాలను కూడా వదలడం లేదు. వాటిపైనా అఘాయిత్యాలకు పాల్పడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కొందరు కామాంధులు ఓ మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ విషయంపై జంతు సంరక్షణ సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. అయితే తాజాగా మరో దుర్మార్గుడు ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

రాజ్‌గఢ్‌ జిల్లా సుతాలియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చోటే ఖాన్ అనే వ్యక్తి ఓ దేవాలయం వద్ద గల ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు అర్థరాత్రి సమయంలో ఇలా అసహజ చర్యలకు పాల్పడుతుండగా మహేష్‌ అగర్వాల్‌ అనే వ్యాపారి గమనించాడు. అతన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికి ఓ సైకోలా ప్రవర్తిస్తూ తనకే ఎదురు తిరిగాడని వ్యాపారి తెలిపారు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వెంటనే నిందితున్ని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చోటేఖాన్ ని అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Last Updated 6, Aug 2018, 6:22 PM IST