ప్రియురాలికి ‘‘తాళి’’ కట్టనన్న కరుణ.. ఆగిపోయిన పెళ్లి.. అవివాహితగానే ప్రియురాలు

First Published Aug 8, 2018, 1:05 PM IST
Highlights

తన సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలను నెలకొల్పిన కరుణానిధి తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రేమనే వదులుకున్నారు. హిందూ సంప్రదాయాలను, విగ్రహారాధన, దేవుడు వంటి వాటికి పూర్తిగా వ్యతిరేకి

తన సుధీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంచలనాలను నెలకొల్పిన కరుణానిధి తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రేమనే వదులుకున్నారు. హిందూ సంప్రదాయాలను, విగ్రహారాధన, దేవుడు వంటి వాటికి పూర్తిగా వ్యతిరేకి. ఈ క్రమంలో 1944 ప్రాంతంలో కరుణానిధి ఓ అమ్మాయిని ప్రేమించాడు.. వివాహానికి అమ్మాయి తరపు కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు. అయితే పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలని ప్రియురాలి కుటుంబం కోరింది.

ఈ సమయంలో తనకు తాళిబొట్టన్నా.. మంత్రాలన్నా పడవని తెగేసి చెప్పిన కరుణ.. అవి లేకుండా వివాహానికి ఓకే చెప్పారట. దీనికి అభ్యంతరం తెలిపిన అమ్మాయి కుటుంబీకులు వివాహాన్ని రద్దు చేశారట.. దీంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన కరుణానిధి ప్రియురాలు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం అవివాహితగానే మిగిలిపోయినట్లు చెన్నైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అన్ నూల్ అల్లా తెలిపారు. 
 

click me!