విషమించిన కరుణానిధి ఆరోగ్యం: ఆస్పత్రికి కుటుంబ సభ్యులు

First Published Jul 29, 2018, 10:04 PM IST
Highlights

డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ  సభ్యులు, మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. 

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ  సభ్యులు, మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకున్నారు. కరుణానిధిని శుక్రవారంనాడు కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. 

ముఖ్యమంత్రి పళనిస్వామి తన సేలం పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని చెన్నైకి బయలుదేరారు. కాంగ్రెసు నేత చిదంబరం కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. 

ఆయన ఆస్పత్రిలో చేర్చిన తర్వాత 95 ఆ కురువృద్ధుడి ఫోటోను రెండు రోజుల క్రితం మొదటిసారి విడుదల చేశారు. కరుణానిధి మూత్రనాళాల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. 

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం కరుణానిధిని చూడడానికి వచ్చారు. ఆ సమయంలో తీసిన ఫొటోలో కరుణానిధి నిద్రపోతున్నట్లు కనిపించారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడిందని శనివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. 

కావేరీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ కరుణానిధి ఆరోగ్యంపై ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని, యాక్టివ్ మెడిక్ సపోర్టుతో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని చెప్పారు.

click me!