కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన నిర్ధారించారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఆయన నిర్ధారించారు. మంత్రి భార్యకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన నిర్ధారించారు. ఆదివారం నాడు ఆయన కరోనా పరీక్షలు నిర్వహించుకొన్నట్టుగా ఆయన తెలిపారు.
also read:వరుస ఘటనలు: నిజామాబాద్ ఆసుపత్రి సూపరింటెండ్ నాగేశ్వరరావు రాజీనామా
undefined
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని మంత్రి ప్రకటించారు. కరోనాకు చికిత్స తీసుకొని ప్రజల కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇంటి నుండి తాను తన పనులు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో సీఎం యడియూరప్ప ఇంటి నుండే విధులను నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున బెంగుళూరు సహా, సిటీ, సబర్బన్ ప్రాంతాల్లో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా సీఎం యడియూరప్ప ప్రకటించారు.