Karnataka Hijab Row: ముదురుతున్న హిజాబ్ వివాదం.. ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల్లో సీటింగ్.. పాఠాలు లేవు

Published : Feb 07, 2022, 01:58 PM IST
Karnataka Hijab Row: ముదురుతున్న హిజాబ్ వివాదం.. ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల్లో సీటింగ్.. పాఠాలు లేవు

సారాంశం

Karnataka Hijab Row: కర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. విద్యాసంస్థలకు ముస్లీం విద్యార్థినీలు హిజాబ్ ధ‌రించి వ‌చ్చార‌నీ ప్ర‌త్యేక త‌ర‌గ‌తుల్లో కూర్చోబ‌డి.. పాఠాలు బోధించ‌డం లేదు.   

Karnataka Hijab Row: కర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం ముదురుతున్నది. రోజురోజుకూ ఈ వ్య‌వ‌హ‌రం వివాదస్ప‌దంగా మారుతోంది. ఇప్ప‌టికే ఈ వివాదం రాజ‌కీయంగా మారింది. రాష్ట్రంలోని ప‌లు విద్యాసంస్థల్లో ముస్లీం విద్యార్థినీలు హిజాబ్ ధరించి రావ‌డంతో.. వారికి కౌంట‌ర్ గా హిందూ విద్యార్థులు.. కాషాయ కండువాలు ధ‌రించి వ‌చ్చారు. దీంతో తీవ్ర దూమారంగా మారింది. ఈ వివాదం క‌ర్ణాట‌క రాష్ట్ర వ్యాప్త‌మైంది. ఈ నేప‌థ్యంలో మతపరమైన ఇబ్బందులను నివారించడానికి  కాలేజీలకు సెలవు ప్రకటించగా, మరికొన్ని కాలేజీ విద్యార్థులను ప్రత్యేక తరగతి గదుల్లోకి అనుమతించింది.

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉడిపి జిల్లాలోని  కుందాపూర్ ప్రభుత్వ కళాశాలలో బాలికలు హిజాబ్ ధరించి క్యాంపస్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. అయితే వారికి పాఠాలు చెప్పకుండా ప్రత్యేక తరగతి గదుల్లో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. ఇటు రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. 

ఈ విష‌య‌మై క‌ళాశాల యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించ‌గా.. క‌ళాశాల‌ గేట్ల వెలుపల రద్దీని నివారించేందుకు ఇలా చేశామని కళాశాల అధికారులు తెలిపారు. విద్యాసంస్థల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ‘యూనిఫాం’ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు హిజాబ్‌ను తొలగించిన తర్వాతే విద్యార్థులు తరగతులకు హాజ‌రు కావాల‌ని ప్రిన్సిపాల్ రామకృష్ణ  పునరుద్ఘాటించారు. మ‌రోవైపు.. త‌ర‌గతుల్లో  హిజాబ్ తొలగించబోమని విద్యార్థులు గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నారు. 

అలాగే.. కుందాపూర్‌లోని కలవర వరదరాజ్ ఎం శెట్టి ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ విష‌యంపై ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "మేము విద్యార్థులను ఇంటికి తిరిగి పంపించాము. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు హిజాబ్ లేకుండా తరగతులకు వెళ్లమని సూచించాం. కానీ వారు నిరాకరించారు. కాబట్టి మేము వారిని కళాశాల‌లోకి అనుమ‌తించ‌లేదు. ఈ వివాదంపై రేపు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వ‌స్తాయో వేచి ఉన్నాం.. " అని వైస్ ప్రిన్సిపాల్ ఉషాదేవి చెప్పారు.  

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో హిజాబ్ వివాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. ఈ ప్రాంతంలోని శాంతేశ్వర పియు,  జిఆర్‌బి కళాశాలలో హిజాబ్ ధరించిన తోటి విద్యార్థులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వ‌హించారు. వారికి వ్య‌తిరేకంగా  కొంత‌ మంది విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క‌ళాశాల క్యాంప‌స్ లోకి ప్రవేశించారు. దీంతో రంగంలోకి దిగిన ప్రిన్సిపల్.. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు రేపు విచార‌ణ జరుపుతుందని విద్యార్థులకు చెప్పి, సెలవు ప్రకటించారు. హిజాబ్ ఆంక్షలను ప్రశ్నిస్తూ ఉడిపిలోని ప్రభుత్వ జూనియ‌ర్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిష‌న్ల‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్లను రేపు హైకోర్టు విచారించనుంది. 

హిజాబ్‌ వివాదం ఎక్కడ ప్రారంభ‌మైంది..

గ‌త‌నెల‌లో ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలలో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి హిజాబ్‌లు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి.. క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌నీ తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో  తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో హిజాబ్ నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్కమగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో  ఫిబ్రవరి 8 (మంగళవారం) ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించనుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని, దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

హిజాబ్ ను వ్య‌తిరేకించ‌డం .. మత ఆచారాల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మేన‌నీ సూచించారు. షిరూర్ మఠం కేసు 1954 ప్రకారం, కొన్ని మతపరమైన ఆచారాలను ప్రభుత్వాలు నిషేధించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఈ వివాదంపై  రాష్ట్ర  ప్రభుత్వం మాట్లాడూతూ..సమానత్వం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగిస్తుందని , అందుకే ఆ దుస్తులను నిషేధించామని తెలిపారు. విద్యాసంస్థల్లో బాలబాలికలు వారి మతం ప్రకారం ప్రవర్తించరాద‌నీ, అలా చేయ‌డం వల్ల సమానత్వం, ఐక్యత దెబ్బతిట్టుంద‌ని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది.

 రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టేందుకు బిజెపి, దాని సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది.

"రాజ్యాంగం మ‌నకు ఏ మతానైనా ఆచరించే హక్కును ఇచ్చిందనీ, అంటే ఎవరైనా వారి మతం ప్రకారం ఎలాంటి దుస్తులు ధరించవచ్చున‌నీ, హిజాబ్ ధరించిన విద్యార్థులను పాఠశాలలో ప్రవేశించకుండా నిషేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘననే  అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.

విద్యాసంస్థల్లో హిజాబ్‌ను ప్రభుత్వం అనుమతించబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ అన్నారు.  "ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది. విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ లేదా ఇతర మ‌తాల‌కు సంబంధించిన ఆచారాల‌ను పాటించే ఆస్కారం లేదు. పాఠశాలలు  సరస్వతి (విద్యా దేవత) ఆలయాలు, ప్రతి ఒక్కరూ ఇక్క‌డ నియమ, నిబంధనలకు కట్టుబడి ఉండాలి, మతాన్ని తీసుకురావడం సరికాదు, విద్యార్థులకు కావాల్సింది విద్య, ఎవరైనా నిబంధనలను పాటించలేకపోతే.. వారు వేరే చోట తమ మార్గాన్ని ఎంచుకోవచ్చు, ”అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !