బీజేపీలో చేరలేదనే తీహార్ జైలుకు పంపారు : డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 7, 2021, 5:09 PM IST
Highlights

భారతీయ జనతా పార్టీ(BJP)పై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్ధతు ఇవ్వలేదని, ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించినందునే తనను గతంలో తీహార్ జైలుకు పంపారని ఆయన బాంబు పేల్చారు. 

భారతీయ జనతా పార్టీ(BJP)పై కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మద్ధతు ఇవ్వలేదని, ఆ పార్టీలో చేరేందుకు నిరాకరించినందునే తనను గతంలో తీహార్ జైలుకు పంపారని ఆయన బాంబు పేల్చారు. దీన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని శివకుమార్ అన్నారు. గతంలో తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలంటూ బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు తాను ఒప్పుకుని ఉంటే తాను తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిందేనని అన్నారు.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వంగా డీకే శివకుమార్ అభివర్ణించారు. ముడుపుల కోసం తమను మంత్రులు వేధిస్తున్నట్లు కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు (supreme court) సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు కేటాయించేందుకు టెండర్ మొత్తంలో 30 శాతం ఇవ్వాలని, పెండింగ్ బిల్లుల విడుదలకు 5-6 శాతం కమిషన్లు మంత్రులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) జూలైలో కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. దీనిపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) విచారణకు ఆదేశించారు.

Also Read:మన పార్టీ చీఫ్ తాగుబోతు.. లంచాలు మెక్కుతాడు.. కాంగ్రెస్ నేతల సంభాషణలు లీక్.. పార్టీలో కలకలం

కాగా.. మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు 2019 సెప్టెంబర్ 3న అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు నెలన్నర రోజుల ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 
 

click me!