
Karnataka: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోని యారధోనా గ్రామంలోని మసీదు సమీపంలో ఆదివారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో దాదాపు 40 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. ఈ ఘటనతో రాష్ట్రంలో మత ఘర్షణలు పెరిగే ప్రమాదం పొంచివుండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. చిన్న లౌడ్ స్పీకర్ల సౌండ్ తో ముస్లిం-హిందూ గ్రూపుల వ్యక్తులు ఈ ఘర్షణకు పాల్పడ్డారు. అయితే, ప్రస్తుతం అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి మసీదు చుట్టూ గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నకొందరు వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్న దృశ్యాలున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “ఇది ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరిగింది. కానీ ఎవరూ దీనిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా లేరు” అని రాయచూర్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.
యారధోనాలోని జామా మసీదు సమీపంలో కొందరు హిందువులు ఉగాది సందర్భంగా రంగులు జల్లుకుంటూ (హోలీ) ఆడుకుంటున్నారు. గట్టిగా డీజే సౌండ్ పెట్టారు. ఈ క్రమంలోనే మసీదు చూట్టు Ugadi celebrations హోలీ ఆడుతున్నారు. దీనికి అక్కడి ముస్లిం వర్గానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారని చెప్పారు. దూషణలు పెరిగి దాడులకు దారి తీసిందన్నారు. అయితే, దీనిపై ఏవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు రాకపోవడంతో పేరు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “ఎస్పీ ప్రజలతో సమావేశమైనప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. మేము స్వయంచాలకంగా గుర్తించాము. సెక్షన్లు 107 మరియు 151 కింద కేసులు నమోదుచేశాము. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులోకి ఉందని తెలిపిన పోలీసులు.. కర్ఫ్యూ లేదా నిషేధ ఉత్తర్వులు ఏమీ జారీ చేయలేదని తెలిపారు.
ఇదిలావుండగా, కర్నాటకలో హిందూ-ముస్లిలకు సంబంధించిన పలు విషయాలు ఇటీవలి కాలంలో వివాదస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ముస్లి విద్యార్థులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడంపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కాషాయ కండువాలు ధరించి నిరసన తెలిపారు. మొదట ఉడిపిలోని ప్రభుత్వ విద్యా సంస్థలో మొదలైన ఈ వివాదం అనంతరం.. ఒక్క కర్నాటకకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు పాకింది. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది ముగిసిన వెంటనే జంతువధకు సంబంధించిన హలాల్ అంశం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం ముసుగు అలముకుంటోంది. ఇప్పుడు మసీదులపై మైకులు, లౌడ్ స్పీకర్లు తొలగింపు అంశం కూడా రాజకీయ రంగు రుద్దుకునే అవకాశం లేకపోలేదు.