కరోనాతో భర్త మృతి.. తట్టుకోలేక ముగ్గురు కూతుళ్లతో కలిసి, నదిలో దూకిన తల్లి.. చివరకు..

By AN TeluguFirst Published Sep 30, 2021, 11:16 AM IST
Highlights

భర్త చనిపోయినప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆమెకు ఏడు లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు పిల్లల్ని పోషించడం, వారి బాగోగులు చూడడం, అప్పులు తీర్చడం అయ్యేపని కాదని అర్థమయ్యింది.

కర్ణాటక : కోవిడ్ రక్కసి(covid 19) కాటుకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. కరోనా కాటుకు కుటుంబ పెద్ద బలి కావడంతో,  నలుగురు ఆడపిల్లల్ని పోషించలేక ఓ తల్లి.. కూతుళ్లతో కలిసి నదిలో (suicide) దూకింది. ఈ సంఘటనలో తల్లి, చిన్న కూతురు మరణించగా… మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 

కరోనాతో హఠాత్తుగా ఇంట్లో అప్పటివరకు మనతో తిరిగిన మనుషులు మాయమవ్వడం.. గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అనేక కుటుంబాలు ఈ విషాదాన్ని మోస్తూ జీవనం సాగిస్తున్నాయి. మరెన్నో కుటుంబాలు ఈ నష్టం నుంచి తేరుకోలేక చిధ్రమై పోయాయి. కరోనా నుంచి కోలుకున్నా ఆర్థికంగా చితికిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా ఇలా ఎంతోమంది జీవితాల్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేసింది.. చేస్తోంది. అలాంటి ఓ విషాద ఘటనే కర్ణాటకలోనూ చోటు చేసుకుంది. కరోనా ఓ నిండు కుటుంబాన్ని నిర్దయగా కాటేసింది. 

ఈ ఘోరం కర్ణాటకలోని గదగ్ జిల్లా రోణ తాలూకా హుళే ఆలూరు వద్ద బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉమాదేవి (40) అనే మహిళ భర్త నెల కిందట కోవిడ్ తో కన్నుమూసాడు. ఆమెకు నలుగురు కూతుళ్ళు.  కాగా, పెద్ద కూతురు గడగ్ లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతోంది.  

ఇండియాకి మరో తుఫాన్ ముప్పు: అరేబియా సముద్రంలో షహీన్ తుఫాన్, పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

భర్త చనిపోయినప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. దీంతోపాటు ఆమెకు ఏడు లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు పిల్లల్ని పోషించడం, వారి బాగోగులు చూడడం, అప్పులు తీర్చడం అయ్యేపని కాదని అర్థమయ్యింది. అంతే..  పుట్టింటికి వెళ్తున్నానని ఇరుగుపొరుగుకు చెప్పి ముగ్గురు కూతుళ్లు తీసుకుని తెల్లవారుజామున ఇంటినుంచి బయలు దేరింది. నేరుగా సమీపంలోని మలప్రభ నది దగ్గరికి వెళ్లింది. నలుగురు కూతుళ్లతో కలిసి నదిలోకి దూకింది.

దీన్నంతా అక్కడే ఉన్న కొంతమంది గమనించారు. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే నదిలోకి దూకి  12, 14 ఏళ్ల ఇద్దరు బాలికల్ని కాపాడారు. కానీ, ఉమాదేవి, ఆమె 8యేళ్ల చిన్న కూతురు నదిలో కొట్టుకు పోయి మృతి చెందారు. 

click me!