corona cases in India: గత 24 గంటల్లో 23,529 కొత్త కేసులు, కేరళలోనే అత్యధికం

Published : Sep 30, 2021, 10:07 AM IST
corona cases in India: గత 24 గంటల్లో 23,529 కొత్త కేసులు, కేరళలోనే అత్యధికం

సారాంశం

ఇండియాలో గత 24 గంటల్లో 23,529 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు 3,37,39,980  మంది కరోనా కేసులు నమోదయ్యాయి.కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేరళలో  కొత్తగా 12,191 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో 23,529 కొత్త కరోనా కేసులు (corona cases)నమోదయ్యాయి.వరుసగా రెండు రోజులుగా 20 వేలకు లోపుగా నమోదైన కరోనా కేసులు నిన్న మాత్రం 20 వేలకు పైగా నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే కరోనాతో 311 మంది మరణించారు.

దేశంలో ప్రస్తుతం 2.77,020 లక్షల కరోనా యాక్టివ్ కేసులు (corona active cases) నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు 3,37,39,980  మంది కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుండి దేశంలో ఇప్పటివరకు 3,30,14,898 మంది కోలుకొన్నారు.ఇప్పటివరకు కరోనాతో 4,48,062 మృతి చెందారు. 

ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో(kerala) కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేరళలో  కొత్తగా 12,191 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కేరళలో కరోనాతో 155 మంది మృతి చెందారు.దేశంలో ఇప్పటివరకు 88,34,70,578 మంది వ్యాక్సినేషన్ తీసుకొన్నారు.

గత 24 గంటల్లో 65,34,306 మంది వ్యాక్సిన్ తీసుకొన్నారని ఐసీఎంఆర్ తెలిపింది.కొత్త కేసుల కంటే కరోనా రికవరీ కేసులే అత్యధికంగా నమోదౌతున్నాయి. నిన్న ఒక్క రోజే 28,718 మది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.85 శాతంగా పెరిగింది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్