బట్టలు విప్పదీసి.. పిడిగుద్దుల వర్షం కురిపించారు.. నోటితో బూట్లను..

Published : Jul 25, 2023, 02:40 AM IST
బట్టలు విప్పదీసి..  పిడిగుద్దుల వర్షం కురిపించారు.. నోటితో బూట్లను..

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని బట్టలు విప్పదీసి  విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. నోటితో షూ తీయమని బలవంతం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రధాన నిందితుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులను అరెస్టు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. రేవా జిల్లాలో ఒక యువకుడ్ని బట్టలు విప్పదీసి.. అర్ధనగ్నంగా మార్చి విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. నోటితో షూ తీయమని బలవంతం చేశారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడి ఇద్దరు అనుచరులను అరెస్టు చేశారు. 

ఈ ఘటనపై రేవా పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ వీడియో రెండేళ్లకు పైగా పాతదని, వైరల్ వీడియో చూసిన తరువాత తాము ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ (55), అతడు గోండు తెగ నాయకుడు, అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేసామని తెలిపారు. ఈ వీడియో మే 2021లో రేవాలోని హనుమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రాహి గ్రామంలో రికార్డ్ చేయబడినట్టు తెలిపారు. అయితే ఇది గత వారం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. 

ప్రాథమికంగా ఆస్తి తగాదాలే ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసు అధికారి సోమవారం తెలిపారు. నిందితుడు బాధితుడ్ని అపహరించి, అర్ధనగ్నంగా చేసి చేతులు వెనుకకు కట్టేసి, కొట్టారు. అతడ్ని నోటితో షూను ఎత్తేశాడని బలవంతం చేశారని  ఎస్పీ తెలిపారు. శనివారం జవహర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరిపై భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. గత నెలలో మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ వ్యక్తి గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం చెలారేగిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !