పెళ్లి సమయంలో నా భార్య మేజర్ కాదు.. విడాకులు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన భర్త.. తుది తీర్పు ఇదే

By Mahesh KFirst Published Jan 27, 2023, 6:04 AM IST
Highlights

కర్ణాటకలో ఓ వివాహితుడు తన పెళ్లి సమయంలో భార్య మైనర్ తీరలేదని కోర్టును ఆశ్రయించాడు. కాబట్టి, తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. నాలుగేళ్ల తర్వాతే తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు. 2012లో పెళ్లి చేసుకున్న ఆ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. చేసేదేమీ లేక భార్య హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.
 

బెంగళూరు: వివాహ సమయంలో తన భార్య మేజర్ కాలేదని, అప్పటికీ ఇంకా మైనరే అని పేర్కొంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. హిందూ మ్యారేజ్ కోడ్ ప్రకారం, ఈ పెళ్లి చెల్లదని వాదించాడు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాతే ఈ విషయం తనకు తెలిసిందన ఫ్యామిలీ కోర్టుకు చెప్పాడు. కాబట్టి, తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. ఈ వాదనలు విన్న తర్వాత ఫ్యామిలీ కోర్టు ఫిర్యాదుదారుడి వాదనలతో ఏకీభవించింది. ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో భార్య.. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. తుది తీర్పు హైకోర్టు వెలువరించింది.

కర్ణాటక మాండ్య జిల్లాకు చెందిన సుశీల, మంజునాథ్‌లు 2012 జూన్ 15న పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల సజావుగా కాపురం చేశారు. ఆ తర్వాత మంజునాథ్ తన భార్య నుంచి విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన పెళ్లి సమయానికి భార్య వయసు 16 సంవత్సరాలు 11 నెలలు అని కోర్టుకు తెలిపాడు. మైనర్‌తో పెళ్లి జరిగిందని పేర్కొన్నాడు. ఈ వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు.. అలాగైతే ఈ పెళ్లి చెల్లదని తేల్చేసింది. వారికి గతేడాది లవిడాకులు మంజూరు చేసింది.

Also Read: నాలుగేళ్ల విడాకులను .... సెలబ్రేట్ చేసుకుంటున్న యువతి..!

కానీ, భర్త కపటత్వం గురించి భార్యకు అర్థమైంది. ఆమె ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పులో పొరపాటు ఉన్నదని హైకోర్టు తెలిపింది. ఫిర్యాదు దారికి అండగా నిలిచింది.  ఇన్నేళ్ల కాపురం తర్వాత వారికి విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును న్యాయమూర్తులు అలోక్ ఆరాధే, జస్టిస్ విశ్వజిత్‌ల ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది.

click me!