Hijab Row: కర్ణాటకలోనే నేటి నుంచి కాలేజ్‌లు ప్రారంభం.. 9 జిల్లాల్లో 144 సెక్షన్

Published : Feb 16, 2022, 10:53 AM IST
Hijab Row: కర్ణాటకలోనే నేటి నుంచి కాలేజ్‌లు ప్రారంభం.. 9 జిల్లాల్లో 144 సెక్షన్

సారాంశం

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉద్రిక్తలు చెలరేగడంతో కర్ణాటకలోని (Karnataka) విద్యాసంస్థలకు అన్ని కాలేజ్‌లకు సెలవులు పక్రటించిన సంగతి తెలిసిందే.

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉద్రిక్తలు చెలరేగడంతో కర్ణాటకలోని (Karnataka) విద్యాసంస్థలకు అన్ని కాలేజ్‌లకు సెలవులు పక్రటించిన సంగతి తెలిసిందే. అయితే పాఠశాలలు ఇప్పటికే తెరుచుకోగా.. నేటి (ఫిబ్రవరి 16) నుంచి ప్రీ యూనివర్సిటీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా చర్యగా మొత్తం 9 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉడిపి, బాగల్‌కోట్, బెంగళూరు, చిక్కబల్లాపుర, గడగ్, తూమ్ కూర్, షిమోగ, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో Section 144 విధించడం జరిగింది. ఈ జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలతో పాటుగా ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా నిషేధం విధించారు. కాలేజ్‌ల ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హిజాబ్‌పై వివాదం కారణంగా కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలో ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించినందుకు కాలేజీలోకి ప్రవేశం నిరాకరించారంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. 

ఈ క్రమంలోనే హిజాబ్ ధరించి విద్యార్థినిలు కాలేజ్‌కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు. కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఓ విద్యార్థిని అల్లా హు అక్బర్‌ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిజాబ్‌ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో.. దాదాపు వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలను మూసివేయవలసి వచ్చింది.

ఇక, హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ సారథ్యంలోని న్యాయమూర్తులు క్రిష్ణ దీక్షిత్, జేఎం ఖాజిల త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తుంది. మంగళవారం విచారణలో ఆసక్తికర వాదనలు వచ్చాయి. దక్షిణాఫ్రికాలోని ఓ కోర్టు వెలువరించిన తీర్పును, మతాలకు సంబంధించి టర్కీ రాజ్యాంగానికి, మన దేశ రాజ్యాంగానికి ఉన్న మౌలిక తేడాలు వంటి విషయాలను పిటిషనర్ తరఫు న్యాయవాది కామత్ ప్రస్తావించారు. వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ ఈ పిటిషన్‌ను విచారించనుంది.

మరోవైపు కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వల ఆదేశంలో ఇప్పటికే పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే హిజాబ్ కు సంబంధించి పలుచోట్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు, పాఠశాలల సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి, తుమకూరు, కొడగు తదితర ప్రాంతాల్లో మంగళవారం విద్యార్థినులు నిరసనకు దిగారు. హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు హిజాబ్‌తో విద్యాలయాల్లోకి రాకూడదని ఉపాధ్యాయులు, పోలీసులు చెప్పడంతో  తమకు సంప్రదాయమే ముఖ్యమని కొందరు విద్యార్థినులు తరగతులను, ప్రిపరేటరీ పరీక్షలను బహిష్కరించారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !