ఎస్కార్టింగ్ సర్వీస్‌ లో పనిచేసే యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం..

Published : Feb 16, 2022, 10:39 AM IST
ఎస్కార్టింగ్ సర్వీస్‌ లో పనిచేసే యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం..

సారాంశం

ఒక్కరాత్రికి ఒక్కరు అని మాట్లాడుకుని.. తీరా ఆ యువతి అందుకు ఒప్పుకుని వచ్చిన తరువాత ముగ్గురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా.. ఇంట్లోనుంచి గెంటేశారు. ఈ ఘటన ముంబయిలో జరిగింది... 

ముంబయి : escorting serviceలో పనిచేస్తున్న ఓ 23 ఏళ్ల యువతి మీద ముగ్గురు వ్యక్తులు gang rapeకి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని మలాడ్ లో ఈ ఘటన జరిగింది. పశ్చిమ మలాడ్ లోని నిందితుల్లో ఒకరి నివాసంలో ముగ్గురు వ్యక్తులు తనపై molestation చేశారని ఆరోపిస్తూ ఆ మహిళ శనివారం పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు,  23 ఏళ్ల మహిళను నిందితుల్లో ఒకరు.. ఒక రాత్రికి రూ. 10,000కి కిరాయికి మాట్లాడుకున్నారు. అయితే, తీరా అక్కడికి వెళ్లాక ఒకరికి బదులుగా ముగ్గురితో ఉండాలని  కోరారు. ఒక్కరికి పదివేలు కాబట్టి ముగ్గురికి ముప్పైవేలు అనుకున్న ఆమె దానికి ఒప్పుకుంది. కానీ డబ్బులు ఇచ్చే సమయానికి వచ్చేసరికి రూ.30వేలకు బదులు రూ.10వేలు ఇచ్చారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లోనుంచి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో ఆ వ్యక్తులు ఆమెను బలవంతంగా ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించారు. దీనిమీద బాధితురిని ఫిర్యాదు మేరకు గ్యాంగ్ రేప్ కేసు నమోదైందని మలాడ్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ లిగాడే ధృవీకరించారు. ఆ తరువాతి వివరాలు తెలుపలేదు. 

ఇదిలా ఉండగా, Madhya Pradeshలోని సీధీ జిల్లాలోని హాత్వా అడవుల్లో రెండు రోజుల పాటు Kidnapped చేయబడి, పలుమార్లు rapeకి గురైన Minor girl సోమవారం జిల్లా ఆసుపత్రిలో మరణించింది. బాధితురాలు ఫిబ్రవరి 11న రేవాజిల్లాలోని తన మేనత్త నివాసం బైట కిడ్నాప్ కు గురైంది.

ఆస్పత్రిలో చేరిన తరువాత మైనర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. సిద్ధి జిల్లా ఆసుపత్రిలో పడేసే ముందు ఆమె మీద అత్యాచారం చేసిన నిందితుడి స్నేహితుల్లో ఒకరు ఆమెతో బలవంతంగా విషం తినిపించాడు. రేవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్ట్రేషన్ నంబర్ లేని జీపులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన మేనకోడలిని కిడ్నాప్ చేశారని.. బాధితురాలి అత్త చేసిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 11న హనుమన్న పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది.

సిద్ధి జిల్లా నివాసి అయిన బాధితురాలు కిడ్నాప్‌కు గురైన రోజు రేవాజిల్లాలోని తన అత్త ఇంటికి వచ్చింది. ఈ కిడ్నాప్ కు సంబంధించిన ఫిర్యాదుతో పోలీసులు కేసులో క్లూల కోసం వెతుకున్న క్రమంలోనే అనిల్ తివారీ అనే వ్యక్తి బాధితురాలిని ఫిబ్రవరి 13 అర్థరాత్రి జిల్లా ఆసుపత్రి గేటు వద్ద పడేసి పారిపోయాడు. బెహ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాత్వా గ్రామానికి చెందిన జీవేంద్ర సింగ్, అభిరాజ్ యాదవ్ తనను కిడ్నాప్ చేశారని, రెండు రోజుల పాటు జీవేంద్ర సింగ్ తనపై పదేపదే అత్యాచారం చేశాడని బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించింది.

ఈ వ్యాఖ్యలను ఇప్పుడు పోలీసులు మరణ వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు. తాను పోలీసులకు చెబుతానని బెదిరించడంతో.. తనతో బలవంతంగా విషం తినిపించారని కూడా ఆమె పేర్కొంది. సీధీ జిల్లా ఆసుపత్రిలో బాధితురాలు మరణించిన ఇరవై గంటల తర్వాత, ప్రధాన నిందితుడు జీవేంద్ర సింగ్ కూడా విషం తాగాడు. జిల్లా ఆసుపత్రికి చేరుకునేలోగా అతను మరణించినట్లు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !