దేశంలో విజృంభిస్తోన్న‌Omicron .. ఎన్ని కేసులు నమోదయ్యాంటే..?

Published : Dec 26, 2021, 11:24 AM IST
దేశంలో విజృంభిస్తోన్న‌Omicron .. ఎన్ని కేసులు నమోదయ్యాంటే..?

సారాంశం

Omicron Updates in India : ప్రపంచ దేశాల్లో దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌... ఇప్పుడు దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 422 కేసులు నమోదు అయ్యాయి.  అందులో130 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, తర్వాత స్థానాల్లో ఢిల్లీ , తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, కేరళ, రాజస్థాన్‌ లు ఉన్నాయి.  

Omicron Updates in India: ప్రపంచదేశాలను దడపుట్టిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్..   భారత్ నూ కలవర పెడుతోంది.  చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.  దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.  అదేస‌మ‌యంలో 130 మంది కోలుకున్నారు.  ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియెంట్ విస్తరిస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కేసులు న‌మోదు కాగా, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 41, కేరళలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి.

 ఇదిలాఉంటే.. మ‌రోవైపు క‌రోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,987 కేసులు నమోదయ్యాయి. అదే స‌మ‌యంలో ఈ మహమ్మారికి 162 మంది బ‌ల‌య్యారు.దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,79,682 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. అలాగే.. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ సంఖ్య రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. కాగా..  గడిచిన 24 గంటల్లో 7,091 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో  రికవరీ అయిన వారి సంఖ్య 3,42,30,354 కు చేరింది. 

Read Also: తెలంగాణ: కొత్తగా 140 మందికి కరోనా.. 6,80,553కి చేరిన మొత్తం కేసులు


ప్రస్తుతం దేశంలో 76,766కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. సెకండ్ వేవ్ తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గ‌త వారం రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతోన్న‌.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెర‌డ‌టంతో  ప్ర‌జ‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి.  మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.  ఇప్పటి వ‌ర‌కు మొత్తం 141.37 కోట్ల మందికి పైగా టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. కాగా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Read Also: Omicron effect.. 5,700 విమానాల స‌ర్వీసుల ర‌ద్దు

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కట్టడికి ఆయా రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు విధించాయి. ఇదిలా ఉంటే...  రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu