కుంభమేళాకు వెళ్లారా.. అయితే ఐసొలేషన్‌లో ఉండాల్సిందే: సర్కార్ ఆదేశం

By Siva KodatiFirst Published Apr 15, 2021, 9:51 PM IST
Highlights

హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాలో భారీగా కరోనా కేసులు వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఆదేశించింది.

హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళాలో భారీగా కరోనా కేసులు వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం ఆదేశించింది.

వీరంతా కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని కోరింది. ఇవాళ కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ట్విటర్లో స్పందిస్తూ.. హరిద్వార్‌లో పవిత్ర కుంభమేళాలో పాల్గొని వచ్చిన వారంతా విధిగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:కుంభమేళాలో పుణ్యస్నానాలు: వెయ్యి మందికి కరోనా

వీరంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని... నెగిటివ్ అని నిర్ధారించుకున్న తర్వాతే భక్తులు తమ రోజూవారీ పనుల కోసం బయటికి రావాలని ఆరోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. ఇదే విషయమై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కేవీ త్రిలోక్ చంద్ర ఉత్తర్వులు సైతం జారీ చేశారు. కుంభమేళాకు వెళ్లి వచ్చే భక్తులంతా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సూచించిన కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, కరోనా కట్టడికి కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఏకంగా ఏడు జిల్లాల్లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. బెంగళూరు, మైసూరు, బీదర్, కుల్పుర్గి, మంగళూరు, ఉడిపి, తుమ్మురులో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

click me!