కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 27 నుండి కర్ణాటకలో‌ లాక్‌డౌన్

By narsimha lodeFirst Published Apr 26, 2021, 2:34 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలో  ఈ నెల 27 నుండి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో  ఈ నెల 27 నుండి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు  లాక్‌డౌన్ ఆంక్షలను సడలించనున్నారు. ఈ సమయంలోనే ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకొనేందుకు ప్రభుత్వం ఆంక్షలను సడలించనుంది.

 

కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 27 నుండి రెండు వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. pic.twitter.com/GAE5HYeQaR

— Asianetnews Telugu (@AsianetNewsTL)

రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకి రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలిపింది. ఏప్రిల్ 27వ తేదీ రాత్రి నుండి లాక్‌డౌన్ అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది.  ఆదివారం నాడు కర్ణాటక కేబినెట్ సమావేశం నిర్వహించారు. గత 24 గంటల్లో కర్ణాటకలో 34 వేల కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో 10 ఏళ్ల నుండి 45 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. 

రాష్ట్రంలో 10 ఏళ్ల నుండి 45 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో ఉత్పాదక రంగం, నిర్మాణాలు, వ్యవసాయ కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ వస్త్ర కర్మాగారాల కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది.రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించింది. 300 మిలియన్ టన్నుల ఆక్సిజన్ నుండి 800 మిలియన్ టన్నుల వరకు ప్రతి రోజూ  రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో ఉందని సీఎం తెలిపారు.
 

click me!