చిన్నపాటి నిర్లక్ష్యం.. ఆ పసివాడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరిలోనూ భయాన్ని రేపుతోంది.
చిన్నపాటి నిర్లక్ష్యం.. ఆ పసివాడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరిలోనూ భయాన్ని రేపుతోంది.
తమిళనాడులోని తిరువళ్లూరులో ఓ ఇంట్లో వేడి నీళ్ల కోసం బకెట్ లో పెట్టిన హీటర్ ను తాకి ఓ బాలుడు తీవ్ర విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆదివారం ఉదయం మృతి చెందాడు.
పోలీసుల కథనం మేరకు తిరువళ్లూరు జిల్లా, కడంబత్తూరు యూనియన్ అదిగత్తూరు గ్రామానికి చెందిన వినాయగం, నిశాంతి దంపతులకు ఒక కుమారుడు అవినాష్ (7) ఉన్నాడు.
ఆదివారం ఉదయం ఏడు గంటలకు వేడి నీళ్ల కోసం వినాయగం బకెట్ లో నీటిని పోసి అందులో హీటర్ పెట్టి నిద్రపోయాడు. తల్లి ఏదో పనుల్లో ఉంది. ఇంతలో అవినాష్ ఆడుకుంటూ వెళ్లి బకెట్లో చేయి పెట్టడంతో విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
బాలుడి కేకలకు విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే తిరువల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. రాత్రంతా తమతోపాటు ఆడుకుంటూ ఉన్న బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ విషయమై వినాయగం ఫిర్యాదు మేరకు కడంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.