భారత్ లో కరోనా.. ఒక్కరోజే మూడున్నర లక్షల కేసులు..!

By telugu news teamFirst Published Apr 26, 2021, 10:36 AM IST
Highlights

ఈకొత్త కేసులతో  కలపుకొని దేశంలో 1,73,13,163 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వారిలో 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
 

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కేసులతోపాటు.. మరణాలు కూడా పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. తాజాగా 2,812మంది  ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. కేవలం ఆదివారం ఒక్కరోజే 14,02,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..  3,52,991 మందికి పాజిటివ్ గా తేలింది.

ఈకొత్త కేసులతో  కలపుకొని దేశంలో 1,73,13,163 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వారిలో 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇక, మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రీయాశీల కేసుల వాటా 15.82 శాతానికి పెరిగింది. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. మరో వైపు నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది కరోనా టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 14,19,11,223 మంది కరోనా టీకా వేయించుకున్నారు.

ఇదిలా ఉండగా.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా అత్యధికంగా విజృంభించడం గమనార్హం.  తాజాగా. అక్కడ 832 మంది మరణించగా... 66వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడు లక్షల మందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు. ఢిల్లీలో 22,933  కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 350 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తరప్రదేశ్ లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. 

click me!