Femina Miss India 2022 : మిస్ ఇండియాగా కర్ణాటక అమ్మాయి సినిశెట్టి..

Published : Jul 04, 2022, 08:59 AM IST
Femina Miss India 2022 : మిస్ ఇండియాగా కర్ణాటక అమ్మాయి సినిశెట్టి..

సారాంశం

ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సిని శెట్టి దక్కించుకున్నారు. 31మంది ఫైనలిస్టుల్లో ఆమె విజేతగా నిలిచారు. 

ముంబయి : Femina Miss India 2022 కిరీటాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన Sini Shetty గెలుచుకుంది. ముంబై నగరంలో జరిగిన vlcc ఫెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో కర్ణాటకకు చెందిన సినిశెట్టిని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్ కు చెందిన Rubal Shekhawat మిస్ ఇండియా 2022  ఫస్ట్ రన్నర్ అప్ గా,  ఉత్తరప్రదేశ్ కు చెందిన షినతా చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా 2022 సెకండ్ రన్నరప్ గా నిలిచారు. 

విస్తృతమైన స్కౌటింగ్ డ్రైవ్ ఇంటర్వ్యూ రౌండ్ల తర్వాత ఆయా రాష్టాలనుంచి 31 మంది ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ఫెమినా మిస్ ఇండియా ప్రయాణంలో అమూల్యమైన అనుభవాలు-జ్ఞాపకాలు తాను పొందానని మాజీ ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ నేహ దుపియా పేర్కొన్నారు. ఈ పోటీల సందర్భంగా నటులు కృతి సనన్, లారెన్ గాట్లీబ్, యాష్ చాండ్లర్ ప్రదర్శనలు జరిగాయి. ఈ షోకు మనీష్ పాల్ హోస్ట్ గా వ్యవహరించారు. 

మిస్ ఇండియా ట్రోఫీకి అతి చేరువలో శివానీ రాజశేఖర్, ప్రస్తుతం ఏ ప్లేస్ లో ఉందంటే..?

58వ  ఏమైనా మిస్ ఇండియాగా టైటిల్ కైవసం చేసుకున్న సినీ శెట్టి స్వరాష్ట్రం కర్ణాటక అయినా ముంబైలోనే పుట్టి పెరిగింది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చేస్తున్నారు. సినీ శెట్టి భరతనాట్య కళాకారిణి కూడా కావడం విశేషం. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టమని ఒక సందర్భంలో తెలిపింది. తన నాలుగేళ్ల వయసు నుంచి భరత నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టినట్లు తెలిపింది. ఈ పోటీల్లో మిస్ తెలంగాణ ప్రజ్ఞా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఐదవ స్థానంలో గార్గీ నంది నిలిచారు. కాగా ఇప్పటి వరకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లారాదత్తా,  Sarah jane డయాస్, సంధ్యా ఛిబ్, నఫీసా జోసెఫ్, రేఖా హండే, లిమారైనా డిసౌజా కర్ణాటకకు చెందిన వారే. ఇప్పుడు ఇదే జాబితాలో సినీ శెట్టి కూడా చేరింది. 

ఫెమీనా మిస్ ఇండియా కిరీటంని సినీశెట్టి 2020లో ఫెమీనా మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి చేతుల మీదుగా అందుకుంది. ఆదివారం జరిగిన 58వ ఫెమీనా మిస్ ఇండియా అందాల పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జ్యూరీ పానెల్ లో సినీనటులు నేహా దూపియా, డినో మోరియా, Malaika arora, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా,  కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్  మిథాలీ రాజ్ లు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌