Karnataka: బస్సుల్లో ప్రయాణం ఉచితం.. ఆటోవాలాలాకు సంకటం.. ప్రయాణికులు లేక విలవిల

Published : Jun 24, 2023, 07:52 PM IST
Karnataka: బస్సుల్లో ప్రయాణం ఉచితం.. ఆటోవాలాలాకు సంకటం.. ప్రయాణికులు లేక విలవిల

సారాంశం

కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీంతో మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇది బాగానే ఉన్నది కానీ, ఆటో డ్రైవర్లు మాత్రం ఈ స్కీమ్‌ను విమర్శిస్తున్నారు. ఈ పథకం తమ పొట్టకొడుతున్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.  

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సేవలు అందిస్తున్నది. దీనితో బస్సులు నిండిపోతున్నాయి. పురుషులకు సీటు దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎక్కడికి వెళ్లాలన్న బస్సుల్లో వెళ్లి వస్తున్నారు. ఈ ఉచితం ఆటో డ్రైవర్‌లకు సంకటంగా మారింది. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నట్టుగా ఉచిత బస్సు సర్వీసులతో ప్రయాణికులు ఖుష్‌గా ఉన్నారు. కానీ, ఆటో డ్రైవర్లు మాత్రం ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు.

పురుషులు దాదాపు టూ వీలర్‌లపై ప్రయాణాలు చేస్తున్నారు. ఆటోవాలాలకు మహిళలే ఎక్కువ గిరాకీ ఇచ్చేది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించడంతో ఆటో వాలాలు ప్రయాణికుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ పథకంతో తమ జీవనోపాధికి గండి పడిందని వాపోతున్నారు.

Also Read: రేపు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పర్యటన షెడ్యూల్ ఇదే

మినీ ముంబైగా పిలిచే హుబ్లీ నగరం రద్దీగా ఉంటుంది. ఇక్కడికి షాపింగ్ కోసం, ఇతర అవసరాల కోసం నిత్యం ప్రయాణికుల రాకపోకలు ఉంటాయి. ఆటో డ్రైవర్ల సంపాదన మంచిగానే ఉండేది. కానీ, ఇప్పుడు వారు ఆదాయం ఎండమావులుగా మారిపోయాయి. తమ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని అంటున్నారు. పని లేకుండా ఇల్లు గడవడం కష్టంగా మారిందని, గత 12 రోజులుగా ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కలేదని ఓ డ్రైవర్ అన్నాడు.

హుబ్లీ ధార్వాడలో దాదాపు 25 వేల ఆటోలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు రూ. 100 కూడా సంపాదించడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. ఆటో డ్రైవర్ల యూనియన్లు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్