Chitradurga: కర్ణాటకలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. చిత్రదుర్గలోని మల్లాపుర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 48వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఏడుగురు ప్రయాణికులతో వచ్చిన కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
Karnataka Road Accident: కర్ణాటకలో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. చిత్రదుర్గలోని మల్లాపుర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 48వ నెంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఏడుగురు ప్రయాణికులతో వచ్చిన కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైన సంఘటన చిత్రదుర్గ జిల్లాలో సోమవారం చోటుచేసుకుందని స్థానికులు చెప్పారు. ఈ దుర్ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను సంసుద్దీన్ (40), మల్లిక (37), ఖలీల్ (42), తబ్రేజ్ (13)గా గుర్తించారు.
ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందని తెలిపారు. "ఈ సంఘటన చిత్రదుర్గలోని మల్లాపుర సమీపంలో జరిగింది. జాతీయ రహదారి-48పై ఆగి ఉన్న లారీని 7 మంది ప్రయాణికులతో కూడిన కారు ఢీకొట్టింది" అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు నర్గీష్, రెహాన్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
VIDEO | Several feared dead after a car collided with a lorry in Karnataka’s Chitradurga earlier today. More details are awaited. pic.twitter.com/dy1xKicBHC
— Press Trust of India (@PTI_News)కారు హోస్పేట నుంచి తుమకూరు వెళ్తోంది..
ప్రాథమిక సమాచారం ప్రకారం కారు హోస్పేట్ నుండి తుమకూరు వెళుతుంది. గాయపడిన వారిని చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సుల్లియాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి
శుక్రవారం దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకా జల్సూర్ గ్రామంలోని కరావళి హోటల్ వద్ద కారు ఢీకొని ముగ్గురు కూలీలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేరి జిల్లా రాణేబెన్నూరు తాలూకా కాకోలా తండాకు చెందిన రేఖప్ప (51), చెన్నప్ప (40), మహంతప్ప (48)లు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ముగ్గురు వ్యక్తులు, భవన నిర్మాణ కార్మికులు తమ పని ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ రేఖప్ప, చెన్నప్ప, మహంతప్ప, వెంకప్పలను ఢీకొట్టాడు. నలుగురిని సుల్లియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చెన్నప్ప మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రేఖప్పను మంగళూరులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మహంతప్పను మంగళూరు ప్రభుత్వ వెన్లాక్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ పై ఐపీసీ సెక్షన్ 279, 337, 338, 304(ఏ) కింద సులియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.