BS Yediyurappa: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Karnataka Former CM BS Yediyurappa: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. లైంగిక వేధింపుల నుంచి పిల్లల రక్షణ కల్పించే పోక్సో చట్టం-2012 కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 17 ఏళ్ల బాధితురాలు తన తల్లితో కలిసి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిందని, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసు అధికారులు తెలిపారు.
యడియూరప్పపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, కుమార్తె యడ్యూరప్పను కలవడానికి వెళ్లినప్పుడు ఫిబ్రవరి 2న ఈ సంఘటన జరిగింది. కాగా, యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా అనేకసార్లు పనిచేశారు. 2008-2011 మధ్య, కొంతకాలం మే 2018లో, మళ్లీ జూలై 2019 నుండి 2021 వరకు సీఎంగా ఉన్నారు. అనేక ట్విస్టుల మధ్య 2021లో సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. యడియూరప్ప తర్వాత బీజేపీకి చెందిన బసవరాజ్ సోమప్ప బొమ్మై కర్ణాటక 23వ ముఖ్యమంత్రి అయ్యారు.
LPG Cylinder Prices : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !
నేరం రుజువైతే యడియూరప్పకు మూడేండ్ల కు పైనే జైలు శిక్ష.. !
తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై యడియూరప్ప ఇంకా స్పందించలేదు. పోక్సో చట్టం 2012 ప్రకారం నేరం రుజువైతే కనీస శిక్ష మూడేళ్లు. అయితే, నేరం ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఆ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు సెక్షన్ 4 ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే కోర్టు నిర్ణయించిన విధంగా 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ముఖ్యమంత్రిని వెనుక నుంచి తోసారు.. మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం