Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెనుక నుంచి ఎవరో తోసారు. దీంతో తలకు తీవ్రగాయంలో ఆమె ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చేరినట్టు ఆ ఆస్పత్రి డైరెక్టర్ మణిమోయ్ బెనర్జీ తెలిపారు.
CM Mamata Banerjee head injury : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. నుదిటిపై తీవ్రమైన గాయం కారణంగా మూడు కుట్లు పడ్డాయి. అలాగే, ముక్కుపై కూడా ఒక కుట్టు వేసినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారనీ, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యంపై తృణమూల్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. దీదీకి ఇంతలా ఎలా గాయపడ్డారనేది మిస్టరీగా మారింది. అయితే, దీనిపై తాజాగా ఆస్పత్రివర్గాలు స్పష్టతను ఇచ్చాయి.
మమతా బెనర్జీని వెనుక నుంచి తోసేశారనీ, దాని వల్లే ఆమె పడిపోవడంతో తీవ్రంగా తలకు గాయం అయిందని ఎస్ఎస్కేఎం డైరెక్టర్ బెనర్జీ అన్నారు. గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. సీఎం కోడలు కజ్రీ బెనర్జీ విలేకరులతో మాట్లాడుతూ.. తనకు వెనుక నుంచి తోసినట్లు వినిపించింది. అయితే ఎవరు నెట్టారు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పుష్ అనుకోకుండా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఇప్పుడు ఈ వ్యవహారంలో కుట్ర జరుగుతుందనే చర్చ మొదలైంది. మమతా బెనర్జీకి ఎన్‌ఎస్‌జి భద్రత కల్పించాలని చాలా చోట్ల డిమాండ్ కూడా మొదలైంది.
LPG CYLINDER PRICES : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !
అసలు ఏం జరిగింది..?
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మమత తన ఇంట్లోనే గాయపడింది. నడుచుకుంటూ వెళ్తున్న మమత కిందపడి తీవ్రంగా గాయపడ్డారని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వెంటనే ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా నుదిటిపై కుట్లు వేయనున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంట్రెస్ పార్టీ తన ఎక్స్ హ్యాండిల్ లో మమత గాయానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకుంది. ఆ దృశ్యాల ప్రకారం దీదీ తనుదిటిపై గాయం బలంగా ఉంది. గాయం లోతుగా కావడంతో రక్తం ముఖంపై నుంచి కారుతూ ఉంది. అందుకే కుట్టు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
కాగా, మమతా గాయం గురించి తెలియడంతో త్వరగా కోలుకోవాలని ప్రధానితో పాటు పలువురు నేతలు ఆకాంక్షించారు. మమతా దీదీ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సీఎం మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా టీఎంసీ అధినేత్రి మమత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆస్పత్రికి చేరుకుని సీఎం మమతా బెనర్జీ పరిస్థితిపై ఆరా తీశారు.
ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు.. మహీ రిటైర్ పై ఏబీ డివిలియర్స్ ఆసక్తికరమై కామెంట్స్ !