Electoral Bonds: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్చి 14న రాజకీయ పార్టీలకు విరాళాలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ల వివరణాత్మక డేటాను విడుదల చేసింది. కేవలం మూడు కంపెనీలు ఏకంగా రూ.2744 కోట్లు విరాళంగా ఇవ్వడం గమనార్హం.
Election Commision release Electoral bonds data: రహస్యంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడం తగదనీ, సంబంధిత వివరాలను అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచాలని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత ఎన్నికల సంఘం (ఈసీఐI), మార్చి 14న, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన ప్రముఖ పెద్ద వ్యాపారాల నుండి అంతగా తెలియని కంపెనీల వరకు అన్ని కంపెనీల వివరణాత్మక డేటాను విడుదల చేసింది. అయితే, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన టాప్-3 వ్యక్తులు/ కంపెనీలు ఏకంగా రూ.2,744 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడం గమనార్హం. స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్ తో పాటు సునీల్ మిట్టల్ కు చెందిన భారతీ ఎయిర్ టెల్, అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత లిమిటెడ్, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు భారీ విరాళాలు అందించిన లిస్టులో ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం ఎస్బీఐ నుంచి సమాచారం అందుకున్న ఎలక్షన్ కమిషన్ మార్చి 15 గడువుకు ఒక రోజు ముందు గురువారం తన వెబ్ సైట్ లో పూర్తి వివరాలను విడుదల చేసింది. పూర్తి సమాచారం రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో తేదీల వారీగా బాండ్ కొనుగోలు చేసిన వారి పేర్లు, బాండ్ మొత్తాన్ని నమోదు చేస్తారు. రెండోది తేదీల వారీగా బాండ్లను రీడీమ్ చేసుకునే పార్టీల పేర్లు ఇవ్వబడ్డాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చిన వారిలో కిరణ్ మజుందార్ షా, వరుణ్ గుప్తా, బీకే గోయెంకా, జైనేంద్ర షా, మోనికాలు కూడా ఉన్నారు.
undefined
LPG CYLINDER PRICES : గుడ్‌న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి !
ఏడీఆర్ నివేదికల ప్రకారం.. మొత్తం రూ.16,518 కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది. ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీకి రూ.6,566 కోట్ల విరాళాలు, కాంగ్రెస్ కు రూ.1,123 కోట్లు (2018 మార్చి నుంచి 2024 జనవరి వరకు లెక్కలు) అందాయి. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అత్యధికంగా రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. టాప్ 3లో రెండు కంపెనీలు ఉండటం, వాటి పేర్లు సామాన్యులకు పెద్దగా వినిపించకపోవడం గమనార్హం. లూథియానాకు చెందిన లాటరీ కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. అయితే, 2022లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన వివిధ యూనిట్లకు చెందిన రూ.409 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో కంపెనీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.966 కోట్లు విరాళంగా ఇచ్చింది. మూడో స్థానంలో ముంబైకి చెందిన క్విక్ సప్లయ్ చైన్ రూ.410 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. వేదాంత, హల్దియా ఎనర్జీ, భారతీ ఎయిర్టెల్, ఎస్సెల్ మైనింగ్, వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్, కెవెంటర్ ఫుడ్పార్క్ ఇన్ఫ్రా, మదన్లాల్ లిమిటెడ్ టాప్-10లో ఉన్నాయి.
ముఖ్యమంత్రిని వెనుక నుంచి తోసారు.. మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
దేశంలో ఎన్నికల విరాళాలు అందించిన టాప్-10 దాతలు
Voter ID transfer: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటర్ ఐడీని బదిలీ చేసుకోవడం ఎలా?