కర్ణాటక బీజేపీకి షాక్.. టికెట్ ఇవ్వలేదని మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ పార్టీకి రాజీనామా!

Published : Apr 16, 2023, 04:55 AM IST
కర్ణాటక బీజేపీకి షాక్.. టికెట్ ఇవ్వలేదని మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ పార్టీకి రాజీనామా!

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్న తరుణంలో రాష్ట్ర బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ రాలేదని పేర్కొంటూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్టున్నట్టు వివరించారు.  

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. మే 10న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తానని వెల్లడించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా జగదీశ్ షెట్టార్ ఉన్నారు. తాన వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

Also Read: కొవిడ్‌తో ‘మరణించిన’ వ్యక్తి రెండేళ్లకు ప్రత్యక్షం.. ‘ఓ గ్యాంగ్ నాకు మత్తు ఇంజెక్షన్లు వేసింది’

కర్ణాటకలో బీజేపీ ఎదుగుదల, తాను అధిరోహించిన పదవులను ఆయన గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను అవమానించిన తీరును చూసి బాధపడ్డాను. వాటన్నింటినీ నేను చాలెంజ్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాను. నేను సిర్సికి వెళ్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. ఆ తర్వాత రాష్ట్రంలో నేను నిర్మించిన బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను’ అని జగదీశ్ షెట్టర్ వివరించారు.

తనకు వ్యతిరేకంగా ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతున్నదని ఈ లింగాయత్ నేత జగదీశ్ షెట్టార్ ఆరోపణలు చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్