
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంచనాలకు మించి ఫలితాలను సాధించింది. మొత్తం 224 స్థానాల్లో.. 136 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యుహా రచన చేసినట్టుగా కనిపిస్తుంది. ఇందుకు కారణం బెంగళూరు అర్బన్ మినహా ప్రతి ప్రాంతంలో కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం కారణం. బీజేపీ, జేడీఎస్ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ మంచి ఫలితాలను రాబట్టింది. ఒక్కసారిగా కర్ణాటకలోని ప్రాంతాల వారీ పరిశీలిస్తే.. ముంబై కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలలో కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా రాణించింది. ఇక్కడ ఆలింగాయత్‌లు బీజేపీ వైపే ఉన్నప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కలుపుకుని సోష్‌ల్ ఇంజనీరింగ్ వల్ల కాంగ్రెస్ విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. సిద్దరామయ్య ఓ సందర్భంలో లింగాయత్ సీఎం అవినీతి పరుడు అని కామెంట్ చేసినప్పటికీ.. బలమైన సోషల్ ఇంజనీరింగ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగలిగిందని చెప్పాలి.
హైదరాబాద్- కర్ణాటక విషయానికి వస్తే.. ఈసారి గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువనే సాధించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా వెనుకబడినదిగా కనిపిస్తుంది. పేదరికం కూడా అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ ప్రాంతానికి చెందినవారే కావడంతో.. ఆయన ఈ సారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. మరోవైపు ఇక్కడి పేదలకు గ్యాస్ సిలిండర్, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరడగం భారంగా మారింది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలపై ఈ ప్రాంత ప్రజలు ఆకర్షితులైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే అత్యధిక పోలింగ్ శాతం కూడా నమోదైంది.
మైసూరు రీజియన్.. ఇక్కడ అత్యధికంగా 61 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వొక్కలిగ మెజారిటీ ఓట్లు ఉండగా.. జేడీఎస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తూ వచ్చింది. అయితే ఈ సారి ఇక్కడ కూడా జేడీఎస్‌కు భారీ షాక్ తగిలింది. రామనగర నుంచి పోటీ చేసిన జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి కూడా ఓడిపోయారు. మరోవైపు దేవెగౌడ కుటుంబంలోని విభేదాలు కూడా ఈ ప్రాంతంలో జేడీఎస్ పట్టు కోల్పోయేలా చేసింది. మరోవైపు ఈ ప్రాంతంలో బాగానే ముస్లిం ఓట్లు కూడా ఉండటం.. అవి మొత్తంగా కాంగ్రెస్‌కు పోలరైజ్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొంత వొక్కలిగ వర్గం జేడీఎస్ వైపు కాంగ్రెస్ వైపు చూసింది.
బెంగళూరు అర్బన్‌కు వచ్చే సరికి.. ఇక్కడ కాంగ్రెస్ గతంతో పోలిస్తే తక్కువ సీట్లను సొంతం చేసుకుంది. అర్బన్ ఓటర్లలో బీజేపీపై సానుకూలత, ప్రధాని మోదీ బెంగళూరులో రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించడం ఇవన్నీ కూడా బీజేపీకి అక్కడ కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక, కోస్టల్ కర్ణాటకలో బీజేపీ పట్టు నిలుపుకుంది. ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 ఫలితాలు.. బీజేపీ-65, కాంగ్రెస్-135, జేడీఎస్-19, ఇతరులు-4 చోట్ల విజయం సాధించారు.