కర్ణాటకలో కాంగ్రెస్ విజయం.. విపక్షాలకు సారథ్యం వహించడానికి ‘చేతి’కి బలం.. ప్రతిపక్ష శిబిరంలో ఉత్సాహం

Published : May 13, 2023, 05:11 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం.. విపక్షాలకు సారథ్యం వహించడానికి ‘చేతి’కి బలం.. ప్రతిపక్ష శిబిరంలో ఉత్సాహం

సారాంశం

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఇతర ప్రతిపక్ష స్థానాల్లోనూ ఆత్మస్థైర్యాన్ని నూరిపోసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పై అపనమ్మకం పెట్టుకున్న ఇతర విపక్ష పార్టీలకు ఈ ఫలితం ఒక భరోసాను ఇచ్చేఅవకాశముంది. తద్వార 2024 ప్రతిపక్ష ఐక్య కూటమికి కాంగ్రెస్ సారథ్యం వహించే అవకాశం ఉన్నది.  

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ విజయం మొత్తంగా ప్రతిపక్ష శిబిరంలోనే ఒక కొత్త ఊపిరి ఊదింది. ఆత్మస్థైర్యం దెబ్బతిన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. ఇతర విపక్ష పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిందే ఏకం కావాలనే వాదన అక్కర్లేనిది.. ఇలాంటి వాదనలకు ఓ సమాధానం కూడా ఈ విజయం ద్వారా లభిస్తుంది. బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొని గెలవడం.. బీజేపీ కంటే రెట్టింపు సీట్లను సాధించడం నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. ఇది వరకు తాము ఎదుర్కొన్న ఓటముల్లో ఇదీ ఒకటి అన్నట్టుగా బీజేపీ స్పందిస్తున్నది.

కాంగ్రెస్‌కు ఈ విజయం.. ఈ ఏడాది చివరిలో జరగబోతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటానికి ఒక స్థైర్యాన్ని తప్పక అందించనుంది. కేంద్రంలోని మోడీని, బీజేపీని గద్దె దింపడానికి జైత్రయాత్ర  ఇక్కడి నుంచి ప్రారంభం అన్నట్టుగా కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

నరేంద్ర మోడీ అజేయుడనే ఒక నమ్మకాన్ని ఈ ఫలితాలు బీటలు వారిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వీలైనంత ప్రచారం చేశారు. కానీ, దాని ఫలితం పెద్దగా కనిపించలేదు. మునిగిపోతున్న పడవను మోడీ కూడా కాపాడలేడనే భావన స్థానిక నేతల్లో ఇంకుతున్నది. గతంలో కంటే సుమారు 40 వరకు సీట్లను కోల్పోయింది. 

కాంగ్రెస్ ఈ నమ్మకాన్ని దెబ్బతీసింది. తనపై అపనమ్మకంతో ఉన్న ఇతర ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ విజయంతో కాంగ్రెస్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వంపై పోరాటంలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్‌దే అని స్పష్టత ఇచ్చింది. 

Also Read: ప్రధాని మోడీ ఓడిపోయాడు: కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్

ఈ విజయం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలోనూ గెలుపొందడానికి కాంగ్రెస్‌కు ఉపకరించవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీతో నేరుగా తలపడే పార్టీ కాంగ్రెస్సే. కానీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచినా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే 2018లోనూ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ, తర్వాతి ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. మోడీ ఛరిస్మాతో 2019 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.

మరి ఈసారి కూడా మోడీ ఛరిస్మా సీట్లను పట్టుకువస్తుందా? అనేదే వేచి చూడాలి. మోడీని ఢీకొట్టడానికి ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి.

అయితే, ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక అడ్వాంటేజీ ఉన్నది. గతంలో విపక్షాలు ఐక్యం కావాలనే అభిప్రాయాలు, ఆలోచనలు లేవు. ఈ సారి ఆ ఆవశ్యకత వాటికి ఏర్పడింది. ఈ ఐక్యత కచ్చితంగా విపక్షాలకు మేలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో విపక్షాల ఐక్యతకు నాయకత్వం ఎవరు వహిస్తారనే వద్దే కూటమి ఏర్పాటు ఆగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పట్టుసడలింపులు వచ్చినట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే 2024 లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత ఏర్పడుతుంది. దానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. అదెంత సమర్థంగా క్యాంపెయిన్ చేయగలిగిందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM