కర్ణాటక క్రైసిస్: సీఎం కుమార స్వామి రాజీనామా..? రాత్రి గవర్నర్ తో భేటీ...

By narsimha lodeFirst Published Jul 22, 2019, 11:15 AM IST
Highlights

రాత్రి 7 గంటలకు గవర్నర్ వాలాను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు ముందే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమార స్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటక:  కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బలనిరూపణకై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. అటు రెబల్స్ తన పంతం వీడటం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం కుమార స్వామిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో కన్నడ నాట నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా సీఎం కుమార స్వామి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

రాత్రి 7 గంటలకు గవర్నర్ వాలాను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణకు ముందే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమార స్వామి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మరోవైపు కర్ణాటక అసెంబ్లీలో సోమవారం నాడే బలపరీక్ష నిర్వహించాలని ఇద్దరు స్వంతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం నాడు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది.

కర్ణాటక అసెంబ్లీలో  విశ్వాస పరీక్షను ఇవాళే నిర్వహించాలని  ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై  సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహించుకోవాలని గవర్నర్ వాజ్ బాయ్ వాలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించారు.

సోమవారం నాడు బలపరీక్ష జరిగేలా చూడాలని  ఆదేశించజాలమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. మరో వైపు  రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తనను కలవాలని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్  ఆదేశించారు. 

కర్ణాటక అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో  తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక సీఎం కుమారస్వామిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు  రాజీనామాలు సమర్పించారు.

ఈ రాజీనామాల వెనుక బీజేపీ ఉందని కర్ణాటక సీఎం కుమారస్వామి విమర్శించారు. మరో వైపు కర్ణాటక సీఎం కుమారస్వామికి ఇదే చివరి రోజు అని  మాజీ సీఎం యడ్యూరప్ప హెచ్చరించిన  విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

కర్ణాటకలో మారిన సీన్... సీఎంగా శివ కుమార్..?

 

click me!