కర్ణాటకలో మారిన సీన్... సీఎంగా శివ కుమార్..?

Published : Jul 22, 2019, 10:27 AM ISTUpdated : Jul 22, 2019, 10:33 AM IST
కర్ణాటకలో మారిన సీన్... సీఎంగా శివ కుమార్..?

సారాంశం

రెబల్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేను వెనక్కి రప్పించడంతోపాటు... సీఎం కుమారస్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ..ఆసక్తి రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కాగా.... శుక్రవారం నాటికి అసెంబ్లీలో ఉన్న సీన్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జేడీఎస్ త్యాగానికి సిద్ధపడిందని సమాచారం.

శుక్రవారం బలపరీక్ష జరగాల్సి ఉండగా... సభ వాయిదా పడటంతో అది జరగేలేదు. దీంతో...  ఇక కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదని అందరూ భావించారు. అయితే... రెబల్ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు కాంగ్రెస్-జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెబల్ ఎమ్మెల్యేను వెనక్కి రప్పించడంతోపాటు... సీఎం కుమారస్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆయన తన సీఎం పదవికి త్యాగం చేసి బాధ్యతలు కాంగ్రెస్ కి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పరోక్షంగా ఓ కాంగ్రెస్ నేత ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కూటమిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.  సిద్ధరామయ్య, పరమేశ్వర, శివకుమార్ లలో ఎవరో ఒకరు సీఎం బాధ్యతలు చేపట్టునున్నట్లు సమాచారం. ఎక్కువ శాతం అవకాశాలు శివకుమార్ కే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... బీజేపీ ప్రలోభాలకు లొంగిపోవద్దంటూ.. సీఎం కుమారస్వామి అసమ్మతి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. మరి వారు వెనక్కి తగ్గుతారో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఎలా ఉన్నా... నేటితో కర్ణాటక సంక్షోభానికి క్లైమాక్స్ పడనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu