KARNATAKA: కోర్టులో దారుణం.. క‌ట్టుకున్న‌ భార్య గొంతు కోసి దారుణ హత్య

By Rajesh KFirst Published Aug 14, 2022, 6:21 AM IST
Highlights

KARNATAKA:  కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. కోర్టు ఆవరణలో ఓ వ్య‌క్తి భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. హోళెనరసీపుర టౌన్​ కోర్టు ప్రాంగణంలో.. శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

KARNATAKA: కర్నాటకలోని హసన్​ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి తాను క‌ట్టుకున్న‌భార్యపై విచ‌క్ష‌ణ రహితంగా దాడి చేసి, గొంతు కోసి హ‌త్య చేశాడు. ఈ అమానుష్య ఘ‌ట‌న ఎక్క‌డో మారుమూల ప్రాంతం జ‌రిగిందనుకుంటే.. పొర‌పాటే.. అది గ్ర‌హ‌పాటే.. కోర్టు ఆవరణలో అంద‌రూ చూస్తుండ‌గా.. ఓ వ్య‌క్తి  త‌న భార్య గొంతు కోసి చంపాడు ఈ ఘ‌ట‌న హోళెనరసీపుర టౌన్​ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకుంది.  మృతురాలిని తట్టెకెరె గ్రామానికి చెందిన ఛైత్రగా గుర్తించారు. నిందితుడు శివకుమార్​ను పోలీసులు అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. తట్టెకెరె గ్రామానికి చెందిన చైత్ర (28), శివకుమార్ (32)ల‌కు గ‌త ఐదేళ్ల క్రితం  వివాహమైంది. తొలుత వారి జీవితం సాఫీగా ఉన్న‌.. దంపతుల మధ్య రెండేళ్ల కింద విభేదాలు రావడంతో.. దూరంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో విడాకులకు దరఖాస్తు  చైత్ర.. త‌న‌కు  భరణం చెల్లించాలని మహిళ కోర్టును ఆశ్రయించింది. కొద్దిరోజులుగా ఈ కేసు నడుస్తోంది.  ఈ క్ర‌మంలో శనివారం భార్యాభర్తలిద్ద‌రూ  హోలే నరసిపురలో ఫ్యామిలీ కోర్టులో హ‌జ‌ర‌య్యారు. వారి కేసును న్యాయమూర్తి విచారించిన తర్వాత, కోర్టు తదుపరి విచారణ తేదీని దంపతులకు ఇచ్చారు. కోర్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న స‌మ‌యంల‌ చైత్ర‌ను   అనుసరించిన భర్త శివకుమార్​ కత్తి గొంతు కోశాడు. అనంతరం పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని హుటాహుటిన హోళెనరసీపుర ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

ఈ ఘ‌ట‌న‌పై పోలీసు సూపరింటెండెంట్ ఆర్ శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ.. "ఒక గంట కౌన్సెలింగ్ తర్వాత, చైత్ర వాష్‌రూమ్‌కు వెళ్లింది, అక్కడ ఆమె భర్త శివకుమార్ కత్తితో ఆమె మెడను కోశాడు. మా సిబ్బంది ఆమెకు కృత్రిమ శ్వాసక్రియ చేసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు, వైద్యులు. ఆమె చనిపోయిందని ప్రకటించారు " అని గౌడ చెప్పారు. హ‌త్యంన‌త‌రం నిందితుడు శివకుమార్‌ను అక్కడి పారిపోతుండ‌గా.. ప్రజలు, పోలీసులు అడ్డుకున్నారు, తరువాత అదుపులోకి తీసుకున్నారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసామనీ, అతను కత్తిని కోర్టు లోపలికి ఎలా తీసుకువచ్చాడు?  అతను దానిని ఎలా ప్లాన్ చేసాడు అనే దానిపై కూడా మేము దర్యాప్తు చేస్తామని అధికారి తెలిపారు.

click me!