CRPF jawans: రోడ్డు ప్ర‌మాదం.. 8మంది CRPF జ‌వాన్ల‌కు గాయాలు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం 

By Rajesh KFirst Published Aug 14, 2022, 4:01 AM IST
Highlights

CRPF jawans:శ్రీనగర్‌లోని సుంబల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది CRPF సిబ్బందికి గాయాలు, ప్రమాదంలో గాయపడిన ఇద్దరు CRPF జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. అలాగే.. శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో శనివారం భద్రతాదళ సిబ్బందిపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు

CRPF jawans: శ్రీనగర్‌లోని సుంబల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లందరినీ ఆస్పత్రికి తరలించారు. జాతీయ‌మీడియా క‌థ‌నాల ప్రకారం.. 164 బిఎన్ ఇ-కాయ్‌కు చెందిన 8 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బండిపోరా జిల్లాలోని సుంబల్ ప్రాంతంలో జరిగింది,  శ‌నివారం సాయంత్రం CRPF వాహనం ప్రమాదానికి గురైంది. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం జేవీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది. 

శ్రీనగర్‌లో దారుణం..సీఆర్పీఎఫ్ జవాన్ల‌పై  గ్రెనేడ్ దాడి
 
మ‌రోవైపు.. శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో శనివారం భద్రతాదళ సిబ్బందిపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన సమాచారం ఇచ్చారు. 

శ్రీనగర్ పోలీసులు ట్వీట్ చేస్తూ..  “అలీ జాన్ రోడ్, ఈద్గా వద్ద ఉగ్రవాదులు భద్రతా దళాలపై గ్రెనేడ్ విసిరారు. ఈ  దాడిలో ఒక CRPF జవాన్‌కు స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.   కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు తెల్లవారుజామున జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మరణించిన రెండు రోజుల తర్వాత గ్రెనేడ్ దాడి జరిగింది.

click me!